మిస్టరీ ఏంటీ : శివాలయంలో రక్తంతో శివుడికి అభిషేకం

అనంతపురము జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం కొర్తికోట గ్రామంలో జరిగిన మూడు హత్యలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. గ్రామ శివారులో ఉన్న శివాలయంలో పూజలు చేస్తూ జీవనం సాగిస్తున్న శివరామిరెడ్డి అతని తోబుట్టువు కమలమ్మతో పాటు ఆలయంలో పూజలు చేయించటానికి వచ్చిన సత్యలక్ష్మిని దారుణంగా హత్య చేశారు. ఈ ముగ్గురు ఆలయంలో నిద్రిస్తున్న సమయంలో.. ఇనుప రాడ్లతో తలలు పగలగొట్టి గొంతుకోసి అతికిరాతకంగా చంపారు దుండగులు. కొర్తికోటలో ప్రభుత్వ భూమి ఎకరా 40 సెంట్లు గుడి పేరుతో రిజిస్టర్ చేయించాలని శివరామిరెడ్డి ప్రయత్నించగా.. గ్రామస్తులు అడ్డుకున్న ఘటన ఇటీవల జరిగింది. దీంతో ట్రిపుల్ మర్డర్ కి క్షుద్రపూజలా, లేక గ్రామంలో జరిగిన గొడవ కారణమా.. అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మృతి చెందిన శివరామిరెడ్డికి ఎవరితోనూ గొడవలు లేవని ..చాలా మంచి వ్యక్తి అని కొర్తికోట గ్రామస్తులు అంటున్నారు. అలాంటి వారిని ఏ దుర్మార్గులు పొట్టన పెట్టుకున్నారో అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు హత్యతో కొర్తికోట గ్రామంతో పరిసర గ్రామాల ప్రజలూ ఉలిక్కిపడ్డారు. ట్రిపుల్ మర్డర్ తో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. క్షుద్రపూజల కోసం ఈ హత్యలు చేశారా లేక ఇతర కారణాలతో ఈ హత్యలు జరిగాయా అనే కోణాల్లో విచారణ చేస్తున్నామని డీఎస్పీ శ్రీనివాస్‌ చెప్పారు. నిందితుల కోసం రెండు ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేశామన్నారు. హంతకులను అతి త్వరలోనే పట్టుకుంటామన్నారు.

శివాలయం పరిసరాల్లో అనుమానస్పద రీతిలో 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ట్రిపుల్ మర్డర్ వెనుక మిస్టరీ నెలకొంది. హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. గుప్త నిధుల కోసం శివాలయంలో క్షుద్రపూజలు చేసి ఆ ముగ్గురిని నరబలి ఇచ్చి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొర్తికోటలో ఉన్న శివాలయం పురాతనమైనది. ఇది శిథిలావస్థకు చేరింది. దీంతో రిటైర్డ్ టీచర్ శివరామిరెడ్డి (75) కొత్త ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు.

దీనికి ఆయన సోదరి కమలమ్మ, బెంగళూరు నివాసి సత్యలక్ష్మి సహకరించారు. ఆదివారం(జూలై 14,2019) అర్ధరాత్రి తర్వాత ఆలయంలో నిద్రిస్తున్న ఈ ముగ్గురూ అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యారు. శివరామిరెడ్డి, కమలమ్మ(70), సత్యలక్ష్మి(70) గొంతుకోసి బండరాళ్లతో కొట్టి చంపారు. వారి రక్తాన్ని శివుడి విగ్రహానికి అభిషేకం చేశారు. ఆలయం సమీపంలో ఉన్న పాముల పుట్టల్లో కూడా రక్తాన్ని పోశారు. గుప్తనిధుల కోసం వచ్చిన దుండుగులు నరబలి ఇచ్చారన్న సందేహాలూ లే

Share.