శ్రీవారి సేవలోరాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి

శ్రీవారి సేవలో ప్రముఖులు

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించా

త్వరలో కరోనా కు మెడిసిన్ కనుగొనేలా ఆశీర్వదించమని కోరా

రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి

తిరుమల,

తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తెలుగు అకాడమీ చైర్మెన్ లక్ష్మి పార్వతి దర్శించుకున్నారు.

విజయ సాయి రెడ్డి మీడియా తో మాట్లాడారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకున్నాను. శ్రీవారిని ప్రార్దించానని తెలిపారు.

ఎందరో ప్రజలు కరోనా మహమ్మారి భారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది భక్తులు ఈ వైరస్ కారణంగా శ్రీవారిని దర్శించుకోలేక పోతున్నారు.

అయినప్పటికీ టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి చక్కటి ప్రణాళికతో భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించడం అభినందనీయమని కొనియాడారు.

త్వరలో కరోనా వైరస్ కు మెడిసిన్ కనుగొనే లా ఆశీర్వదించాలని శ్రీవారిని కోరినట్లు తెలిపారు.

Share.