విశాఖపట్నం ఫార్మాసిటీలో భారీ పేలుడు …..

3
VizagFire #Vizag

విశాఖపట్నం : ఫార్మా సిటీలో భారీగా పేలుడు సంభవించింది. రాంకీ సీఈటీపీ సాల్వెంట్స్‌లో ఈ పేలుడు సంభవించింది. ప్రస్తుతం భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి.దీంతో పరిసర ప్రాంత వాసులు భయాందోళనకు గురవుతున్నారు. మంటలు ఎగసిపడుతున్న ప్రదేశంలో ఇప్పటికి 17సార్లు పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు.ప్రమాద స్థలానికి చాలా దూరంగా  అగ్నిమాపక శకటాలు ఆగిపోయాయి. మంటల్ని అదుపు చేసేందుకు సమీపంగా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. 

విశాఖ పార్మాసిటీ లో మొత్తం 85 కంపినీలు ఉన్నాయిమంటలు వ్యాప్తి చెందితే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఇంకా మంటలు అదుపులోకి రానేలేదుప్రస్తుతం నైట్ షిఫ్ట్ లో 65 మంది ఉండవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు.మొత్తం 12 ఫైర్ ఇంజన్ల్ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి అయినా ఎ మాత్రం అదుపులోకి రావడం లేదు.లోపల నుంచి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయని స్థానికులు చెప్తున్నారు..పోలీస్ ఉన్నతాధికారులు సంఘటన స్థలికి చేరుకున్నారు

విశాఖ ఫార్మాసిటీ అగ్ని ప్రమాదంపై స్పందించిన కలెక్టర్

విశాఖపట్నం పరవాడ ఫార్మాసిటీలోని సాల్వెంట్స్‌లో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఫైరింజన్లను పంపామని కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు.

ఘటనా స్థలానికి అంబులెన్స్‌లను కూడా తరలించామని చెప్పారు.

పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతుండటంతో అగ్నిమాపక వాహనాలు దగ్గరకు వెళ్లలేకపోతున్నాయి.

సమీపంలో అనేక కంపెనీలు ఉండటంతో ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here