విశాఖ ఘటన దురదృష్టకరం..మృతి చెందిన కుటుంబాలకు రూ. కోటి చొప్పున ఆర్థిక సాయం

చనిపోయిన వారిని నేను తిరిగి తీసుకుని రాలేను కానీ మనసున్న వాడిగా మాత్రం వారికి అండగా ఉంటా ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ. కోటి చొప్పున ఆర్థిక సాయం

విశాఖ ఘటన దురదృష్టకరం

వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న వారికి రూ.10 లక్షలు సాయం

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి రూ.1 లక్ష సాయం

అందరూ కోలుకునే వరకు ఉచిత వైద్యం

ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు..

[ విశాఖ చేరుకున్న సీఎం జగన్, కింగ్ జార్జ్ హాస్పిటల్ కు వెళ్లారు

[పరిస్థితి పూర్తి అదుపులో..

ఉదయం 6.30 కల్లా గ్రామంలో ప్రతి ఒక్కరినీ ఆసుపత్రిలో చేర్పించాం

ఇంట్లో ఉన్నవాళ్లను తలుపులు పగలగొట్టి బయటికి తీసుకొచ్చాం

ఎల్‌జీ పరిశ్రమలో పని చేసే సిబ్బంది సేఫ్‌

8 మంది మరణించారు

వదంతులు నమ్మొద్దు

-ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో పరిస్థితి ప్రస్తుతం అదుపులో ఉందని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ చెప్పారు. సంఘటన జరిగిన వెంటనే అప్రమత్తమై గ్రామానికి పోలీసులు చేరుకున్నారు. తలుపులు పగలగొట్టి బాధితులను ఆసుపత్రులకు తరలించాం.ఉదయం 6.30 కల్లా వెంకటాపురంలో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

ఇప్పటి వరకు 8 మంది చనిపోయారు. ఇందులో ఒక చిన్నారి ఉంది. మొత్తం 315 మంది వరకు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితులను ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా చేర్చుకోవాలని ఆదేశించాం.

25 అంబులెన్స్‌లు, గుజరాత్,రాజస్థాన్‌కు వెళ్లడానికి సిద్ధంగా ఉన్న బస్సుల్లో బాధితులను తరలించాం. ప్రజలెవరూ వదంతులు నమ్మొద్దు.

ఎల్‌జీ కంపెనీపై కేసు నమోదు చే సి.. విచారణ చేపట్టాం. విషవాయువు నిర్మూలన కు గాల్లో నీళ్లు చల్లుతున్నాం.

అందరూ కోలుకుంటున్నారు

ఆసుపత్రుల్లో బాధితులందరూ కోలుకుంటున్నారు. వారికి ఫ్లూయిడ్స్‌ ఇస్తున్నాం. కొంత మందికి సిట్రజిన్‌ మాత్రలు ఇచ్చాం. గాలి పీల్చుకునేందుకు ఇబ్బందులు పడేవారికి ఆక్సిజన్‌ అందిస్తున్నామని కేజీహెచ్‌ డాక్టర్లు చెప్పారు.

ఇబ్బందేమీ లేదు..

బాధితులందరూ సేఫ్‌గా ఉన్నారని విశాఖ జేసీ వేణుగోపాల్‌ రెడ్డి అన్నారు. దాదాపు 316 మంది బాధితులు కేజీహెచ్, ప్రతిమ, అపోలో, కేర్‌ తదితర ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నాం. 15వేల మందికి భోజన ఏర్పాట్లు చేస్తున్నాం. అక్షయపాత్రతో మాట్లాడాం. మేం చెప్పే వరకు గ్రామాలకు వెళ్లకూడదని ఆయన చెప్పారు.

దీర్ఘకాలంలో ఇబ్బందులేవీ ఉండవు..

ఈ గ్యాస్‌ వల్ల దీర్ఘకాలిక ఇబ్బందులేవీ ఉండవు. దాహం ఎక్కువ ఉంటుందని కాబట్టి నీళ్లు ఎక్కువ తీసుకోవాలి. మాస్కు తప్పనిసరిగా వాడాలి. తడిబట్టలు వేసుకుంటే ఇబ్బంది ఉండదు.

Share.