వైఎస్ రాజశేఖర్ రెడ్డికి జగన్ నివాళి


దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించి సరిగ్గా నేటికి (సెప్టెంబరు 2) పదేళ్లు అయ్యింది. రచ్చబండ కార్యక్రమంలో పాల్గోనటానికి వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కర్నూలుకు 40 కిలోమీటర్ల దూరంలో నల్లమల అడవుల్లోని పావులరాళ్ల గుట్ట వద్ద కూలిపోయిన విషయం తెలిసిందే. వైఎస్ వర్దంతిని పురస్కరించుకుని సీఎం జగన్‌‌మోహన్ రెడ్డి ఈరోజు (2019, సెప్టెంబరు 2న) కడపజిల్లా పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

సోమవారం ఉదయం 8.30 గంటలకు ఆయన ఇడుపులపాయ వైస్ సమాధి వద్దకు చేరుకుని దివంగత తన తండ్రి వైఎస్ సమాధివద్ద నివాళులు అర్పిస్తారు. తర్వాత భాకరాపురంలో మాజీ మంత్రి, తన బాబాయ్ వైఎస్.వివేకానందరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

అనంతరం ఆర్‌ అండ్‌ బి గెస్ట్‌హౌస్‌లో పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. తిరిగి అదే రోజు సాయంత్రం 5 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి సీఎం చేరుకుంటారు.

Share.