ఎవరు – రివ్యూ

67
EVARU-Movie-Review

క్షణం సినిమాతో చిన్న సినిమాలు పెద్ద విజయం అందుకోవడం అనే ఒక ట్రెండ్‌ని సెట్ చేసి.. గూఢచారితో దాన్ని పీక్స్‌కి తీసుకెళ్లాడు అడివి శేష్. ఆ రెండు సినిమాలతో ఓ తరహా థ్రిల్లర్ మూవీస్‌కే కాదు.. తనకంటూ కూడా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం క్షణం సినిమా ప్రొడ్యూసర్ PVP తో కలిసి మళ్ళీ ఎవరు? అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చడీచప్పుడు లేకుండా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకి సాహో పోస్ట్ పోన్ అవ్వడంతో లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ కూడా దక్కింది. అలా అనుకోకుండా అన్నీ కలిసొచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందా? లేదా? ట్రైలర్ తెచ్చిన ఇంప్రెషన్‌ని నిలబెట్టుకుని హిట్ అనిపించుకుందా? లేదా? అనేది ఇప్పుడు చూద్దాం.

ఈ సినిమా కథ విషయానికి వస్తే : తమిళనాడులోని కూనూర్‌లో ఒక గెస్ట్ హౌస్‌లో సమీరా, DGP అశోక్‌ని హత్య చేస్తుంది. అతను ఆమెని మానభంగం చెయ్యడం వల్ల చంపాను అని ఒప్పుకుంటుంది. ఒక పోలీస్ అధికారి మర్డర్ కావడంతో ఆ కేస్‌లో నిజా నిజాలు విచారించి ఛార్జ్ షీట్ దాఖలు చెయ్యడానికి పోలీసులకు 10 రోజులు టైం ఇస్తుంది కోర్ట్. అయితే ఈ లోగా సమీరా ఆ కేస్ నుండి బయట పడడానికి తన ప్రయత్నాలు మొదలు పెడుతుంది. అందులో భాగంగా విక్రమ్ వాసుదేవ్ అనే కరెప్టెడ్ ఆఫీసర్‌కి అసలు అక్కడ ఏం జరిగింది అనేది చెప్పడం మొదలుపెడుతుంది. ఈలోగా ఒక సందర్భంలో సంవత్సరం క్రితం మిస్ అయిన వినయ్ వర్మ మిస్సింగ్ గురించి అతని కొడుకు ఆదర్శ్ అతన్ని వెదుక్కుంటున్న తీరు గురించి వివరిస్తాడు విక్రమ్ వాసుదేవ్. అసలు ఈ రెండు కేసులకు సంబంధం ఏంటి?, అసలు సమీరా ఎవరు?, అశోక్‌ని ఆమె ఎందుకు చంపింది?, వినయ్ వర్మ ఏమయ్యాడు?… ఇలా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం సినిమా చూసి తెలుసుకోవాలి.

నటీనటులవిషయానికి వస్తే : క్షణం,గూఢచారి సినిమాలతో తనలోని సెటిల్ యాక్టర్‌ని పరిచయం చేసిన శేష్.. ఈ సినిమాలో కూడా అదే తరహా యాక్టింగ్‌ని కొనసాగించాడు. కానీ విక్రమ్ వాసుదేవ్ అనే కరెప్టెడ్ పోలీస్‌కి కాస్త రెక్లెస్ యాటిట్యూడ్ పెట్టడానికి ట్రై చేసారు కానీ అది అంతగా సెట్ అవ్వలేదు. అది మినహాయిస్తే శేష్ పాత్రకి, నటనకి వంకలు పెట్టడానికి ఏం లేదు. ఇక తెలుగులో సినిమా చేసి చాలాకాలం అయిన రెజీనా ఈ సినిమాలో విక్టిమ్‌గా నటించినా కూడా కాస్త గ్లామరస్‌గా కనిపించింది. కొన్ని సీన్స్‌లో తడబడినా ఓవరాల్‌గా మ్యానేజ్ చేసింది. ఇక నవీన్ చంద్ర, మురళి శర్మ, పవిత్ర లోకేష్ తదితరులంతా సహజమయిన నటనతో ఆకట్టుకున్నారు.

టెక్నీషియన్స్ విషయానికి వస్తే : ఈ సినిమా డైరెక్టర్ వెంకట్ రాంజీ సినిమాని చాలా గ్రిప్పింగ్‌గా తెరకెక్కించాడు. ఇది ది ఇన్విజిబుల్ గెస్ట్ మూవీకి అఫీషియల్ అడాప్షన్ అయినప్పటికీ కాంప్లికేటెడ్ స్క్రీన్‌ప్లేని చాలా జాగ్రతగా చెబుతూ.. చివరి వరకు కూడా సినిమాలో సస్పెన్స్ మెయింటైన్ చేశాడు. డైరెక్టర్‌గా అతనికి ఇది మంచి డెబ్యూ సినిమా. అబ్బూరి రవి రైటింగ్ కూడా సినిమాకి చాలా ప్లస్ అయ్యింది. చాలా చిన్న చిన్న డీటైల్స్‌ని డైలాగ్స్‌తో చెప్పించడం బావుంది. ఇక ఈ సినిమా పేరే ‘శేష్ ఎవరు’ అని పెట్టారు. దాన్ని బట్టే ఈ సినిమా కథ, కథనంలో, ఈ సినిమా పట్టాలెక్కడంలో, ఈ సినిమా రూపకల్పనలో శేష్ కంట్రిబ్యూషన్ ఎంత అనేది అర్ధమవుతుంది. వంశీ పచ్చిపులుసు ఛాయాగ్రహణం సినిమాకి పెద్ద ఎస్సెట్. లిమిటెడ్ లొకేషన్స్ లో, లిమిటెడ్ ఆర్టిస్టులతో తెరకెక్కిన ఈ సినిమాకి గ్రాండ్ లుక్ రావడంలో అతని హార్డ్ వర్క్‌‌కి క్రెడిట్ ఇచ్చి తీరాలి. శేష్ ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల ఆర్.ఆర్ తో సినిమాకి ప్రాణం పోశాడు.. సినిమా స్థాయిని పెంచాడు.. థ్రిల్లర్ మోడ్‌ని ఫుల్‌గా ఎలివేట్ చేశాడు. గ్యారీ ఎడిటింగ్ కూడా చాలా క్రిస్ప్‌గా ఉంది. ఈ సినిమా రన్ టైం రెండు గంటల లోపే ఉందీ అంటే సినిమాని ఎంత జాగ్రత్తగా ట్రిమ్ చేసారో అర్ధమవుతుంది. నిర్మాణ విలువలు బావున్నాయి.

ఓవరాల్‌గా చెప్పాలి అంటే : అడివి శేష్ సినిమా అనే బ్రాండ్‌తో PVP ప్రొడక్షన్ నుండి వచ్చిన ఎవరు? నాణ్యమయిన ఒక థ్రిల్లర్. ఈ జోనర్‌ని ఆదరించే వాళ్ళు తక్కువగా ఉంటారు కాబట్టి రెజీనా గ్లామర్‌ని వేల్యూ ఎడిషన్‌గా వాడుకుంటూ, ఎక్కడా బోర్ కొట్టించకుండా అనుక్షణం గెస్సింగ్ స్క్రీన్‌ప్లే‌తో సాగుతూ ఎండ్ ట్విస్ట్‌తో కూడా అలరించిన ఎవరు? లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్‌ని కూడా వాడుకుంటూ బాక్సా‌ఫీస్ దగ్గర సందడి చెయ్యడం ఖాయం.

ప్లస్ పాయింట్స్
కాస్టింగ్

స్క్రీన్‌ప్లే

ఆర్.ఆర్.

సినిమాటోగ్రఫీ

ఎడిటింగ్

సినిమా నిడివి

డైరెక్షన్

మైనస్ పాయింట్స్

అక్కడక్కడా శృతి మించిన గ్లామర్

లిమిటెడ్ అప్పీల్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here