“మాస్టర్” మూవీ రివ్యూ…..

139

 

తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ హీరోగా – మక్కల్ సెల్వన్ అనిపించుకున్న విజయ్ సేతుపతి విలన్ గా నటించిన హై బడ్జెట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ‘మాస్టర్’. నగరం, ఖైదీ సినిమాలతో బిగ్గెస్ట్ గెట్స్ అందుకున్న యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తమిళంతో పాటు తెలుగులో కూడా అనుకున్న దానికంటే ఎక్కువ థియేటర్స్ లో రిలీజైన ఈ మాస్టర్ ప్రేక్షకులను మెప్పించేలా ఉన్నాడో లేదో చూద్దాం..

కథ:

జెడి(విజయ్) ముందుకు బానిసగా మారిన ఒక ప్రొఫెసర్. కాలేజ్ కి తాగి వస్తూ ఉంటాడు, కానీ అతని యాక్టివిటీస్ కి, అతని మాటలకి కాలేజ్ లో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. అలాగే అతని స్టైల్ అండ్ మ్యానరిజమ్స్ చూసి అదే కాలేజ్ లో పనిచేసే మాళవిక మోహనన్ ప్రేమలో పడుతుంది. అక్కడ జరిగిన కొన్ని పరిస్థితుల వలన జువెనైల్ స్కూల్(బాల నేరస్తుల స్కూల్)కి పంపిస్తారు. ఆ ఏరియాకి గ్యాంగ్ స్టర్ అయిన భవాని(విజయ్ సేతుపతి) ఆ స్కూల్ పిల్లలని ఉపయోగించుకొని కొన్ని క్రైమ్స్ చేస్తుంటాడు. ఆ విషయంలో జెడి – భవాని మధ్య క్లాష్ వస్తుంది. అక్కడి నుంచి ఆ స్టూడెంట్స్ లో జెడి ఎలా మార్పు తీసుకువచ్చాడు. అలాగే భవాని క్రైమ్స్ ని ఎలా పాడు? ఎలా భవాని కథని జెడి ముగించాడు అనేదే కథ.

హైలైట్.
..

ఈ సినిమాకి మొదటి హైలైట్, అందరిలోనూ అంచనాలు పెంచేసింది విజయ్ – విజయ్ సేతుపతి కాంబినేషన్.. ఆ హైప్ కి తగ్గట్టుగానే ఇద్దరూ మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మన్స్ తో అభిమానులకి ఫుల్ మీల్స్ ఇచ్చారు. ముందుగా విజయ్, తాగుబోతు ప్రొఫెషర్ గా చాలా ఫ్రెష్ లుక్ లో కనిపించి స్టైలిష్ అనిపించుకోవడమే కాకుండా తన మ్యానరిజమ్స్, చిన్న చిన్న ఎక్స్ ప్రెషన్స్ తో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాడు. అలాగే మాస్ సీన్స్ లో తనదైన స్టైల్లో మెప్పించాడు. ఇక విజయ్ సేతుపతి విలన్ పాత్రలో పిచ్చెక్కించాడు అని చెప్పాలి. ప్రతి సీన్ లో, ఆ క్రూరత్వం చూపే ఎపిసోడ్స్ లో హావభావాలు సింప్లీ సూపర్బ్. విజయ్ కంటే విజయ్ సేతుపతికే ఈ సినిమాలో రెండు మార్కులు ఎక్కువ పడతాయి, ఎక్కువ పేరు కూడా వస్తుంది. స్పెషల్ గా విజయ్ సేతుపతికి రాసిన డైలాగ్స్ గురించి చెప్పాలి. ప్రతి డైలాగ్ కి ఆడియన్స్ విజిల్స్ వేస్తారు. ఓవరాల్ గా సినిమా వేగం చాలా చోట్ల పడిపోయినా వీరి నటనే ఎంతో కాస్త ప్రేక్షకులకి ఊరటనిస్తోంది. మాళవిక మోహనన్ ఉన్నది తక్కువ సేపే అయినా క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. ఆండ్రియా జెరెమియా పాత్రని సరిగా ఉపయోగించుకోలేదు. శాంతను భాగ్యరాజ్, అర్జున్ దాస్ లు తమ పాత్రల్లో మెప్పించారు.

తెర వెనుక టాలెంట్..

ఈ తెర వెనుక డిపార్ట్ మెంట్స్ లోనే సినిమా రిజల్ట్ చాలా వరకూ ఆధారపడి ఉంటుంది. ఇక్కడ కొందరు డల్ అయిపోయి నీరసం వచ్చేస్తున్నా సినిమాలో కూడా ఏదో చేసి లేపాలి అని ప్రయత్నించింది మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్. ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కాడా డౌన్ అయినా పరవాలేధనిపిస్తుంది, కానీ సెకండాఫ్ మాత్రం చాలా బోరింగ్ గా, ఇంకెంత సేపు సాగుతుందయ్యా అనే ఫీలింగ్ వస్తుంది కానీ అనిరుద్ మాత్రం నిరంతరం మ్యూజిక్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడానికి విశ్వా ప్రయత్నం చేసాడు, సూపర్బ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు కానీ ఉపయోగం లేకుండా పోయింది. అనిరుద్ తర్వాత సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ మస్త్ అనిపిస్తాయి. ఆర్టిస్టులని చూపించిన విధానం, కథకి తగ్గట్టు తను ఎంచుకున్న విజువల్ ఫీల్, ప్రెజంటేషన్ అన్నీ బాగున్నాయి. ఇకపోతే సతీష్ కుమార్ ఆర్ట్ వర్క్ బాగుంది. అలాగే స్టంట్ సెల్వ యాక్షన్ బ్లాక్ మాస్ ఆడియన్స్ కి బాగా నచ్చుతాయి. వీలైనంత వరకూ రోప్స్ లేకుండా చాలా నాచురల్ గా చేయడానికి ట్రై చేశారు. అందుకే కాస్త రిఫ్రెషింగ్ గా అనిపిస్తాయి. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ అంతంత మాత్రం అని చెప్పాలి. ఇతనేనా ఖైదీకి ఎడిటర్ అని పిస్తుంది. ఓవరాల్ గా 3 గంటల సినిమాలో ఈజీగా 40 నిమిషాలు కోసేసినా సినిమాకి పెద్ద డామేజ్ ఏం ఉండదు. కానీ ఇలా ఉంచేయడం వలన బోర్ కొట్టించేసారు.

ఈ సినిమాకి కెప్టెన్ అయిన లోకేష్ కనకరాజ్ విషయానికి వస్తే, ఖైదీ సినిమా వలన లోకేష్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. కానీ ఆ అంచనాలను అందుకోలేకపోయారు. కథ చాలా సింపుల్, కానీ కథనంలో ఆడియన్స్ ని సీట్ ఎడ్జ్ లో కూర్చొని ఎంజాయ్ చేసేలా మ్యాజిక్ చేయడం లోకేష్ స్పెషాలిటీ. కానీ ఆ మ్యాజిక్ ఇందులో మిస్ అయ్యింది. ఎక్కడో తన మార్క్, విజయ్ కమర్షియల్ ఇమేజ్ మధ్యలో ఇరుక్కుపోయాడనిపిస్తుంది. మాస్టర్ అటు విజయ్ సినిమా లాను లేదు, అలా అని లోకేష్ బ్రాండ్ సినిమాలను లేదు అనిపించడం ఖాయం. ఎక్కడో విజయ్ ఇమేజ్ వలన లోకేష్ పూర్తిగా దారి తప్పాడు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ పరవాలేధనిపించినా సెకండాఫ్ మాత్రం చాలా చాలా బోర్ కొట్టించదమే కాకుండా మరీ మూస పద్దతిలో చెప్పడం ఇంకా చిరాకు తెప్పిస్తుంది. అందరూ భారీగా ఊహించుకున్న విజయ్ – విజయ్ సేతుపతి ఫియట్ కూడా పెద్ద కిక్ ఇవ్వలేదు. లోకేష్ కి టైం తక్కువ ఉండడం వలన కథనం మీద సరిగా వర్క్ చేయలేదనేది అర్థమవుతుంది. మాములుగా లోకేష్ కి రొటీన్ సినిమానే కానీ ఇంత బాగా తీసాడా అనే టాగ్ ఖైదీతో వచ్చింది కానీ మాస్టర్ తో ఇంత రొటీన్ స్టోరీని మరీ ఇంత బ్యాడ్ గా చెప్పాడనిపిస్తుంది. డైరెక్టర్ గా మాస్టర్ తో సక్సెస్ కాలేకపోయాడని చెప్పాలి. మిగిలిన రైటింగ్ టీం కూడా ఇంకాస్త వర్క్ చేసి ఉండాల్సింది. జేవియర్ బ్రిట్టో ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

విజిల్ మోమెంట్స్:

– విజయ్ పెర్ఫార్మెన్స్

బోరింగ్ మోమెంట్స్:

– తెలిసిన కథ
– కథనంలో మ్యాజిక్ లేకపోవడం
– నేరేషన్ స్లోగా ఉండడం
– బాబోయ్ అనిపించే సెకండాఫ్
– సాగదీసి వదిలే రన్ టైం
– ఎఫెక్టివ్ గా లేని ఎడిటింగ్

విశ్లేషణ:

తెలుగులో లోకేష్ కనకరాజ్ ‘ఖైదీ’ సినిమా పెద్ద హిట్ అవ్వడం వలన విజయ్ ‘మాస్టర్’ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ సినిమాని దృష్టిలో పెట్టుకొని వస్తే ఖచ్చితంగా డిజప్పాయింట్ అవుతారు. కానీ కొన్ని కొన్ని పార్ట్స్ ఓకే ఓకే అనిపిస్తాయి. రెగ్యులర్ కథకి కథనంలో సపోర్ట్ దొరకపోవడం, లెంగ్త్ 3 గంటలు ఉండడం ఈ సినిమాని ప్రేక్షకులకు చాలా వరకూ డిస్కనెక్ట్ చేశాయి. ఓవరాల్ గా మాస్ అంశాలు కోరుకున్న విజయ్ మరియు విజయ్ సేతుపతి ఫాన్స్ కి సినిమా కొంతవరకూ నచ్చే అవకాశం ఉంది, కానీ ఓవరాల్ గా మూవీ లవర్స్ కి మాత్రం సెకండాఫ్ రాను రాను డౌన్ అయిపోవడం వలన నీరసం వచ్చి సినిమా బాలేదబ్బా అనే ఫీలింగ్ తో బయటికి వస్తారు.

రేటింగ్ : 2.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here