గ్యాంగ్ లీడర్ మూవీ రివ్యూ

89
Nani's Gang Leader Movie review

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న హీరో న్యాచురల్ స్టార్ నానీ. కృష్ణార్జున యుద్ధం సినిమాతో భారీ ప్లాప్ అందుకున్న నానీ రెగ్యులర్ కమర్షియల్ సినిమా ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తుంది అని గ్రహించి కొత్త కథలను ఎంచుకుని ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే కొత్తదనం దిశగా అడుగులు వేసి ముందుగా జెర్సీ అనే సినిమా తీశాడు. కానీ అందులో నానీ మార్క్ కామెడి పూర్తిగా మిస్ అవడంతో సినిమాలో ఉన్న ఎమోషన్ కి కేవలం క్రిటిక్స్ అండ్ ఫామిలీ ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. దాంతో ఈ సారి కొత్తదనం ఉన్న కథలను మాత్రమే డీల్ చేసే విక్రమ్ కుమార్ తో కామెడీ యాంగిల్ ని కూడా ట్రై చేశాడు. ఈ క్రమంలోనే గ్యాంగ్ లీడర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నానీ. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? అనే విషయం తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

కథ:
పంజాగుట్టలోని ఓ బ్యాంక్ లో 300కోట్లరూపాయల దొంగతనం జరుగుతుంది. ఆ దొంగతనం ప్లాన్ చేసిన ఆరుగురు దొంగల్లో ఒకదొంగ మిగతా ఐదుగురిని చంపేసి 300 కోట్ల డబ్బుతో పారిపోతాడు. దీంతో తమ కుటుంబాలకు అన్యాయం చేసిన గుర్తు తెలియని వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకోవడానికి సరస్వతి (లక్ష్మీ), వరలక్ష్మి (శరణ్య), ప్రియ (ప్రియాంక మోహన్)తో సహా మొత్తం ఐదుగురు సిద్ధం అవుతారు. అందుకోసం ఫేమస్ క్రిమినల్ నావెల్ రచయిత పెన్సిల్ పార్థసారధి సాయం తీసుకుంటారు. అలా ఆగ్యాంగ్ కు లీడర్ గా మారిన పెన్సిల్ పార్థసారధి ఆ క్రిమినల్ ని ఎలా కనుక్కున్నాడు అతని ఆట ఎలా కట్టించాడు అనేదే సినిమా కథ. చూసి తెలుసుకోవాల్సిందే.

నటి నటుల ప్రతిభ:
నానీని నేచురల్ స్టార్ అని ఎందుకు అంటారు అనేది మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. కామెడీ ఎదో చేస్తున్నాడు అని కాకుండా సెటిల్డ్ కామెడీతో సినిమాని నడిపించాడు. సెకండ్ ఆఫ్ లో ఉన్న కొద్దీ పాటి ఎమోషన్స్ లో కూడా నానీ నటనతో అకట్టుకున్నాడు. నానీ నటన సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. సీనియర్ నటి లక్ష్మీ నటన ఈ సినిమాలో మాత్రం కామెడీ గా కూడా సాగింది. అక్కడక్కడ నవ్వించి చివరిలో సినిమాకి ఫుల్ ఫీల్ తీసుకువచ్చే ఎమోషన్స్ సీన్స్ లో తన నటన అనుభవం చూపించింది లక్ష్మీ. ఇక ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ప్రియాంక అరుల్ మోహన్ కి పెద్దగా నటించే అవకాశం దక్కలేదు. ఉన్నంతలో డీసెంట్ స్క్రీన్ ప్రజెంన్స్ తో అలరించింది.వెన్నెల కిషోర్ కామెడీ ఎపిసోడ్స్ పర్బాలేదు అనిపిస్తాయి. ఈ సినిమాలో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆర్ ఎక్స్ 100 సినిమా హీరో కార్తికేయ.. తన లుక్స్ తో తన నటనతో ఆకట్టుకున్నాడు. అంబులెన్స్ డ్రైవర్ నుంచి అంతర్జాతీయ కారు రేసర్‌గా ఎదిగిన దేవ్ పాత్రలో కార్తీకేయ మెప్పించాడు. అతను కేవలం హీరో పాత్రలనే కాకుండా మిగతా పాత్రలను కూడా సునాయాసంగా నటించగలను అని ఫ్రూ చేసుకున్నాడు. ఇక మిగతా నటీనటులు అందరూ కూడా గ్యాంగ్ లీడర్ సినిమాను రక్తి కట్టించారు.

డైరెక్టర్ గురించి:
వీరుడికి ప్ర‌తీసారీ ఆయుధ‌మే అవ‌స‌రం ఉండ‌దు. చిన్న క‌ర్ర‌పుల్ల దొరికినా యుద్ధం చేసేస్తాడు. కొంత‌మంది దర్శ‌కులు అటువంటి టైపే. చిన్న క‌థ దొరికితే చాలు తమ సత్తా ఏంటో నిరూపించుకుంటారు. విక్ర‌మ్ కె.కుమార్ మాత్రం ఎప్పుడూ బ‌ల‌మైన ఆయుధాల‌తో వస్తాడు. త‌న బ‌లం క‌థ‌. త‌న బ‌ల‌గం స్క్రీన్ ప్లే. సాధార‌ణ‌మైన లైన్ తీసుకుని స్క్రీన్ ప్లే అధ్భుతంగా అల్లేసి కొత్తదనం చూపిస్తాడు.. అలాంటి విక్ర‌మ్ మ‌రోసారి వినూత్న‌మైన కాన్సెప్ట్‌ రివైంజ్ స్టోరీ.. అయిదుగురు ఆడ‌వాళ్లు రివేంజ్ తీర్చుకునే కథ చాలా చక్కగా రాసుకుని మెరుపులు మెరిపించాడు. సినిమాలో సెన్సిబులిటీస్ ఆకట్టుకుంటాయి. ఫస్ట్ హాఫ్ వరకు సాదా సీదాగా సాగిపోయిన గ్యాంగ్ లీడర్.. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి.. విలన్ ను హీరో ఎలా కనిపెడతాడు.. ఎత్తుకు పై ఎత్తు వేసి హీరో గ్యాంగ్ రివేంజ్ ను ఎలా తీర్చుకుంది అనే సన్నివేశాలను చాలా చక్కగా మలిచాడు.

టెక్నికల్ పరంగా:
ఈ సినిమాకు సంగీత దర్శకుడు అనిరుధ్ ను సెలక్ట్ చేసుకున్నది నానీనే. అయితే ఈ సినిమాలో పాటలు విన్న తరువాత అతను ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ చూసిన తరవాత.. నానీ సెలక్షన్ కరెక్ట్ అనిపిస్తుంది. అనిరుధ్ సినిమాకు పూర్తి న్యాయం చేశాడు. సినిమాటోగ్రాఫర్ మీరోస్లా కూబా బ్రోచెస్ కూడా విక్రమ్ కే కుమార్ అనుకున్న కథను.. స్క్రీన్ మీదకు తీసుకుని రావడంలో 100శాతం సక్సెస్ అయ్యాడు. సినిమాలో ప్రతి సన్నివేశానికి అతను ఎంచుకున్న సినిమాటిక్ యాంగిల్స్ చాలా బాగున్నాయి. తన కెమేరా పనితనంతో సినిమాకు మంచి లుక్ తెచ్చాడు.

ప్లస్ పాయింట్స్
నాని యాక్టింగ్
కథ, సెకండ్ హాఫ్
బ్యాగ్రౌండ్ స్కోర్
సినిమాటోగ్రఫీ
నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్
తగ్గిన కామెడీ
కనెక్ట్ కాని ఎమోషన్స్
ఫస్ట్ హాఫ్ లో రొటీన్ కథనం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here