ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు. ఇలా ఈ సినిమా ద్వారా నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అల్లు అర్జున్ నటనకు కేవలం అభిమానులు ప్రేక్షకులు మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది హీరోయిన్స్ అర్జున్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని తెగ ఆశపడుతున్నారు.
ఈ క్రమంలోనే ఓ బ్యూటీ ఏకంగా అల్లు అర్జున్ తో కలిసి రొమాన్స్ చేయాలని ఉంది అంటూ తన మనసులో కోరికను బయటపెట్టారు. మరి ఆ ముద్దుగుమ్మ ఎవరు అనే విషయానికి వస్తే.. అల్లు అర్జున్ పై మనసు పారేసుకున్న ఆ ముద్దుగుమ్మ మరెవరు కాదు ప్రియా భవానీ. కళ్యాణం కమనీయం’ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది తొలి సినిమాతోనే ఆడియెన్స్‌ను తన అందంతో కట్టి పడేసింది. ఆ తర్వాత గోపీచంద్ తో ‘భీమా’, సత్యదేవ్ ‘జీబ్రా’ చేయగా. ఇప్పుడు తమిళంలో మాత్రం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా ప్రియా భవాని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె మాట్లాడుతూ… తనకు అల్లు అర్జున్ అంటే చాలా పిచ్చి అని తెలిపారు ఆయనతో కలిసి బిగ్ స్క్రీన్ పై కనిపించాలని కోరికగా ఉందని తెలిపారు. అది రొమాంటిక్ సన్నివేశంలో అయినా పర్వాలేదు తాను నటిస్తాను అంటూ ప్రియ భవాని అల్లు అర్జున్ గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి అల్లు అర్జున్ ఈమెకు కనీసం ఒక సీన్ లో అయినా ఛాన్స్ ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది