సాధారణంగా ప్రతి భార్య కూడా తనకంటే తన భర్త సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకోవాలని కోరుకుంటుంది. అది సాధారణ మహిళ అయినా సెలబ్రిటీలు అయినా కూడా తమకంటూ కూడా తమ భర్తకు మంచి ప్రాధాన్యత ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ విషయంలో స్నేహ రెడ్డి కూడా అలాంటి ఆలోచననే కలిగి ఉందని తెలుస్తుంది. ఈమె కూడా తన భర్తకు సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉండాలని ఎప్పుడూ పరితపిస్తూ ఉండేవారట.
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఈ సినిమా సీక్వెల్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలాంటి తరుణంలోనే అల్లు అర్జున్ పై కేసు నమోదు కావడం ఆయన అరెస్టయి జైలుకు వెళ్లడం పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కోవడం జరిగింది. ఇలా అల్లు అర్జున్ చుట్టూ ఉన్న ఈ వివాదాలు చూసి ఒక్కసారిగా స్నేహ రెడ్డి ఎంతగానో కుమిలిపోయారు.
ఈమె తన భర్త అరెస్టును తలుచుకొని ఎంతగా ఎమోషనల్ అయిందో అందరికీ తెలిసిందే. ఇలా తన భర్త తిరిగి ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలరా పేరు ప్రతిష్టలను సొంతం చేసుకోగలరా అన్న బాధ కూడా భరించింది. అయితే తన భర్త సొసైటీలో ఎలా ఉండాలని అయితే కోరుకుందో అల్లు అర్జున్ కు అలాంటి ప్రాధాన్యత దక్కడంతో ఈమె చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బయటకు ఎక్కడికి వెళ్లినా పాన్ ఇండియా స్థాయిలో అల్లు అర్జున్ పేరు చెబితేనే పుష్ప అంటూ మాట్లాడుతున్నారు.
సినిమాల ద్వారా ఎంత డబ్బు సంపాదించాము అనేదానికంటే కూడా ఎంత పేరు సంపాదించాము అనేది ముఖ్యం. ప్రస్తుతం అల్లు అర్జున్ కు పాన్ ఇండియా స్థాయిలో అంతే మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న నేపథ్యంలో స్నేహ రెడ్డి కోరుకున్నట్టే తన భర్త పేరు, తన భర్తకు గుర్తింపు లభించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది. ఇక పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ అట్లీతో సినిమా చేయబోతున్నారు అయితే ఈ సినిమాకు సంబంధించి ఇంకా ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో అభిమానులు కూడా కొత్త సినిమా అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.