ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ”పుష్ప 2” సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 1780 కోట్లు వసూల్ చేసింది. అయితే ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ అట్లీ, త్రివిక్రమ్ లతో సినిమా చేయనున్నాడు. తాజాగా అల్లు అర్జున్ అబుదాబిలో మెరిశారు. అబుదాబిలో ఉన్న స్వామి నారాయణ్ మందిర్ ను అల్లు అర్జున్ సందర్శించారు. ఆలయ నిర్మాణాలను అల్లు అర్జున్ ఆసక్తిగా తిలకరించారు. అక్కడి ప్రతినిధులు అల్లు అర్జున్ కి ఆలయ విశిష్టతను ప్రాముఖ్యలను వివరించారు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
పుష్ప2 మూవీ ఎంతగా బ్లాక్ బాస్టర్ హిట్ సాధించిందో.. అదే రేంజ్ లో వివాదాల్లో కూడా నిలిచింది. మొత్తంగా ఈ సినిమా సక్సెస్ ను మాత్రం బన్నీ అంతగా ఎంజాయ్ చేయలేదని చాలా మంది తరచుగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తుంటారు.ఈ నేపథ్యంలో బన్నీ కొన్ని రోజులుగా తరచుగా మళ్లీ వార్తలలో ఉంటున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ అట్లీతో తన తర్వాతి ప్రాజెక్ట్ చేస్తున్నారని.. దీనిలో కూడా అల్లు అర్జున్ భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నారని టాక్ నడుస్తొంది.
బన్నీలో కెరీర్ లోనే టాప్ రెమ్యునరేషన్ అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం నడుస్తొంది. దీని గురించి మూవీ టీమ్ అఫిషీయల్ గా తొందరలోనే ప్రకటిస్తారని వార్తలు జోరుగా వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ లోని అబుదాబీకి వెళ్లారు. అక్కడ ప్రఖ్యాత హిందూ దేవాలయం స్వామి నారాయణ్ మందిర్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందర్శించారు. శనివారం (మార్చి 22) ఆలయానికి వెళ్లిన బన్నీ అక్కడి నిర్మాణాలను, శిల్పాలను ఆసక్తిగా గమనించారు.
Allu Arjun, Indian actor visits the #AbuDhabiMandir pic.twitter.com/LUNIUbuB8h
— BAPS Hindu Mandir (@AbuDhabiMandir) March 22, 2025