అమరావతిలో సంస్థలకు భూ కేటాయింపులపై పాత పాలసీనే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది మంత్రుల కమిటీ. అమరావతిపై ఆసక్తి ఉన్న ప్రతీ ఒక్కరికి కేటాయింపులు ఉంటాయని క్లారిటీ ఇచ్చింది. సీఆర్డీఏ అభివృద్ధి చేసిన ప్లాట్లు విక్రయించి రాజధానిని నిర్మిస్తామని మంత్రులు తెలిపారు. రాజధాని అమరావతిలో వేర్వేరు సంస్థలకు భూకేటాయింపులపై మంత్రి నారాయణ నేతృత్వంలో మంత్రుల కమిటీ సమావేశమైంది. పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, టీజీ భరత్, కందుల దుర్గేశ్ సమావేశానికి హాజరయ్యారు. అమరావతి నిర్మాణంలో భాగంగా చేసే భూ కేటాయింపులపై గతంలో ఉన్న విధానాన్నే కొనసాగిస్తామని భేటీ అనంతరం మంత్రుల కమిటీ స్పష్టం చేసింది.
గతంలో 131 మందికి భూములు కేటాయించామని, ఇందులో 31 సంస్థలకు చేసిన కేటాయింపులను యధాతథంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు మంత్రి నారాయణ. రెండు సంస్థలకు గతంలో కేటాయించినట్టు కాకుండా వేరే చోట ఇవ్వాలని నిర్ణయించామన్నారు. 16 సంస్థలకు స్థలంతో పాటు పరిధిని మార్చామన్నారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారని మంత్రి నారాయణ గుర్తు చేశారు. 43 వేల కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచామన్నారు.
మెజార్టీ నిధులను సీఆర్‌డీఏనే సమకూర్చుకునేలా ప్రాజెక్ట్‌ను డిజైన్ చేశామని మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. రాజధాని కట్టాలంటే లక్షల కోట్లు కావాలని గతంలో జగన్ అన్నారని.. తామిప్పుడేమైనా లక్షల కోట్లు ఖర్చు చేస్తామని అన్నామా అంటూ ప్రశ్నించారు. ఆసక్తి ఉన్న వాళ్లకు భూకేటాయింపులు ఉంటాయని క్లారిటీ ఇచ్చిన మంత్రుల కమిటీ, కంపెనీల నిర్మాణ పనులు ప్రారంభం చేయడానికి సిద్ధంగా లేని వాళ్ల కేటాయింపులు రద్దు చేస్తామని కూడా స్పష్టతనిచ్చింది. మొత్తానికి అమరావతిలో నిలిచిపోయిన పనులు త్వరలోనే ఊపందుకోనున్నాయి.
అమరావతిలో భూముల కేటాయింపుపై గతంలో ఉన్న విధానాన్నే కొనసాగిస్తామని నారాయణ స్పష్టం చేశారు. గతంలో 131 సంస్థలకు భూములు కేటాయించినట్లు తెలిపారు. వీటిలో 31 సంస్థలకు చేసిన కేటాయింపులను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించామన్నారు.
మరో రెండు సంస్థలకు గతంలో ఇచ్చిన చోట కాకుండా వేరొక చోట కేటాయింపులు చేయనున్నట్టు పేర్కొన్నారు. 16 సంస్థలకు గతంలో కేటాయించిన భూ విస్తీర్ణంలో మార్పులు చేయడంతోపాటు వేరే ప్రాంతాల్లో కేటాయింపులు చేస్తున్నామన్నారు. 13 సంస్థలకు వివిధ కారణాలతో కేటాయింపులు రద్దు చేయనున్నట్టు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.48 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచి సంస్థలను ఎంపిక చేసినట్టు తెలిపారు. 23 రోజుల్లో అమరావతి పనులు ప్రారంభమవుతాయన్నారు. రాజధాని కోసం ప్రజల సొమ్ము రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదని కేశవ్ తెలిపారు. భూముల అమ్మకాలతో మాత్రమే అమరావతి నిర్మాణం జరుగుతుందని ఖజానాపై భారం లేకుండా సీఎం మంచి మోడల్ డిజైన్ చేశారని చెప్పారు.
వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపుతో మూడు ముక్కలాట ఆడి రాజధానిని పక్కన పడేసిందని నారాయణ ఆరోపించారు. అప్పట్లోనే 43 వేల కోట్లకు విలువైన పనులకు టెండర్లు పిలిచి 9 వేల కోట్ల విలువైన పనులు పూర్తి చేసామన్నారు. అయితే వైసీపీ కక్ష సాధింపుతో అమరావతిపై మూడు ముక్కలాట ఆడిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక న్యాయపరమైన సమస్యలు పరిష్కరించడానికి 8 నెలలు పట్టిందని గుర్తు చేశారు.
48 వేల కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచి ఇప్పటికే ఏజెన్సీలను ఎంపిక చేశామని నారాయణ వివరించారు. సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం పొందగానే ఆయా సంస్థలతో సీఆర్డీఏ అగ్రిమెంట్లు చేసుకుంటుందని అన్నారు. ఆ వెంటనే రెండు మూడు రోజుల్లో అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు మంత్రి నారాయణ. ఎన్నికల కోడ్ ఉండటంతో టెండర్ల ప్రక్రియ ఆలస్యం అయిందని మరోసారి తెలియజేశారు మంత్రి.
భూముల అమ్మకం ద్వారానే అమరావతి నిర్మాణంఛ పయ్యావుల కేశవ్.
రాజధాని కోసం ప్రజల సొమ్ము ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదని మంత్రి కేశవ్ తెలిపారు. భూముల అమ్మకాలతో మాత్రమే అమరావతి నిర్మాణం జరుగుతుందని…ఖజానాపై భారం లేకుండా సీఎం చంద్రబాబు మంచి మోడల్ డిజైన్ చేసారని చెప్పారు. గతంలో అమరావతి కోసం జగన్ లక్ష కోట్లు కావాలని ప్రజలను తప్పుదోవ పట్టించారని…లక్ష కోట్లు అవసరం లేకుండానే రాజధాని నిర్మిస్తున్నామని మంత్రి పయ్యావుల అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలను మభ్య పెట్టి వారితో ఆడుకున్నారని ఎద్దేవా చేశారు.