*”ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియా”గా అనంతను తయారు చేయడమే లక్ష్యం*
– *: బ్రాండ్ అనంతపురం సృష్టించేందుకు కృషి చేయాలి*
– *: అనంత ఉద్యాన సమ్మేళనంలో రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్*
అనంతపురం నగరంలో యం.వై.ఆర్. ఫంక్షన్ హాల్ లో అనంత హార్టీ కల్చరల్ కాంక్లేవ్ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు, ఉద్యానవన శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ ,జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ , అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు,జిల్లా ఉద్యాన అధికారులు హార్టికల్చర్ సంబంధించిన స్టాల్స్ ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో “Pure O Natural” ఇంకా పలు కంపెనీలతో ఎంవోయూలు చేస్కోవడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ ఫ్రూట్ బౌల్ గా గుర్తుంపు పొందిన మన అనంతపురాన్ని హార్టికల్చరల్ రంగంలో మరింత అభివృద్ధి చేయుటకు పునాధిగా హార్టికల్చర్ కాన్క్లేవ్ కి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో “Pure O Natural” కంపెనీ ప్రతినిధులు మేనేజర్ సిహెచ్ మోహన్ రంగా , సీసీ మానేజర్ కే మనోహర్ పాల్గొన్నారు.