ఏపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవుల జాబితా రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. మున్సిపల్, మార్కెటింగ్, ఇన్‌స్టిట్యూషన్ కార్పొరేషన్ల కంటే దేవాలయాల పాలక మండళ్లపై ఆశావహుల్లో తీరని ఆకర్షణ కనిపిస్తోంది. అధికారంలో ఉన్న టీడీపీతో పాటు జనసేన, బీజేపీ శ్రేణులు కూడా తమకు చోటు దక్కేలా వరుసగా లాబీ చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో కండువాలు కప్పినవాళ్లు ఇప్పుడు “మాకేం ఇచ్చారు?” అని ప్రశ్నలు వేస్తున్నారు.తాజాగా ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 76 ఆలయాల పునరుద్ధరణకు రూ.143 కోట్ల నిధులను మంజూరు చేసింది. దీనిపై పనులు వేగంగా కొనసాగుతుండగా, అదే సమయంలో ఆలయాల పాలక మండళ్లను పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆలయాల అభివృద్ధి, నిర్వహణకు కీలకంగా ఉండే ఈ పాలక మండళ్లలో చోటు కోసం ఎంపీ స్థాయి నేతల నుంచి, గ్రామీణ నాయకుల దాకా అందరూ రంగంలోకి దిగారు. కేవలం పథకాల్లో కాకుండా “దేవుడి సేవ”ను దక్కించుకునేందుకు చేసే ఈ ప్రయత్నాల వెనక రాజకీయ ప్రాధాన్యత అంతుచిక్కదు.
విశాఖ నరసింహ స్వామి, విజయవాడ కనకదుర్గ, శ్రీశైలం మల్లిఖార్జున, అన్నవరం సత్యనారాయణ స్వామి వంటి ప్రముఖ దేవాలయాల్లో పాలకులుగా ఉండటం.. భక్తులలో గుర్తింపు, సామాజికంగా భద్రత, రాజకీయంగా ఓ ఇమేజ్ అని భావిస్తున్నారు. పైగా ఈ సేవల ద్వారా సమాజంలో ఒక ప్రత్యేక స్థానం ఏర్పడుతుంది. అందుకే నియోజకవర్గ స్థాయిలోనూ నేతలు ఒత్తిడి పెంచుతున్నారు.అయితే మూడురాజకీయ పార్టీల కూటమిలో భాగస్వాముల సంఖ్య అధికంగా ఉండటంతో, ఈ నియామకాల విషయంలో హైకమాండ్ ముందు వడపోత కచ్చితంగా ఉండబోతుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఆలయాల పేరుతో వచ్చిన పదవులు అయినా, వీటిని పొలిటికల్ ఎక్వేషన్‌లో భాగంగా బేట చేయాలన్నది చర్చనీయాంశంగా మారింది.
తాజాగా ముప్ఫయి మార్కెట్ కమిటీ ఛైర్మన్ల పోస్టులను చంద్రబాబు నాయుడు భర్తీ చేశారు. అన్ని రకాలుగా సామాజికవర్గాల సమీకరణాలతో పాటు ప్రాంతాల వారీగా ఎంపిక చేశారు.ముప్ఫయి మార్కెట్ ఛైర్మన్ పదవుల్లో 25 తెలుగుదేశం పార్టీ తీసుకోగా, నాలుగు జనసేన తీసుకుంది. ఒకటి మాత్రం బీజేపీకి ఇచ్చింది. త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీ ఛైర్మన్ల పదవులను కూడా భర్తీ చేస్తామని చెబుతున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తూ వస్తున్న ప్రభుత్వం మహానాడుకు ముందే అన్ని పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది.
నియోజకవర్గం- మార్కెట్ కమిటీ -ఛైర్మన్ పేరు – పార్టీ
1. పులివెందుల -సింహాద్రిపురం -బండి. రామాసురరెడ్డి- టీడీపీ
2. కాకినాడ నగరం -కాకినాడ -బచ్చు శేఖర్ – టీడీపీ
3. ఉండి-ఆకివీడు -బొల్లా వెంకటరావు-టీడీపీ
4. ప్రత్తిపాడు(గుంటూరు) -ప్రతిప్తాడు-బొందలపాటి అమరేశ్వరి- జనసేన
5. ఇచ్చాపురం- ఇచ్ఛాపురం- బుద్ధ మణిచంద్ర ప్రకాష్ -టీడీపీ
6.యర్రగొండపాలెం(ఎస్సీ) -వై. పాలెం -చేకూరి సుబ్బారావు -టీడీపీ
7. గన్నవరం(SC) -అంబాజీపేట -చిట్టూరి శ్రీనివాస్ -టీడీపీ
8. తణుకు -అత్తిలి -దాసం ప్రసాద్ -జనసేన
9.చంద్రగిరి-పాకాల -కె. సుధాకరయ్య-టీడీపీ
10.పుంగనూరు-సోమాల-కరణం శ్రీనివాసులు నాయుడు-టీడీపీ
11. పూతలపట్టు (SC)-బంగారుపాలెం-కర్రియావుల భాస్కర్ నాయుడు -టీడీపీ
12.బనగానపల్లె- బనగానపల్లి-కాట్రెడ్డి మల్లికార్జున్ రెడ్డి -టీడీపీ
13. నందిగామ (SC) -కంచికచెర్ల-కోగంటి వెంకటసత్యనారాయణ -టీడీపీ
14. అవనిగడ్డ -అవనిగడ్డ -కొల్లూరి వెంకటేశ్వరరావు-టీడీపీ
15. పెనమలూరు-ఉయ్యూరు-కొండా ప్రవీణ్ కుమార్-టీడీపీ
16.పాడేరు (ఎస్టీ)-పాడేరు- మచ్చల మంగతల్లి-బీజేపీ
17. రాజమండ్రి రూరల్ -రాజమండ్రి -మార్ని వాసుదేవ్ -టీడీపీ
18.కొవ్వూరు (SC) -కొవ్వూరు -నాదెళ్ల శ్రీరామ్ చౌదరి -టీడీపీ
19. మైలవరం-విజయవాడ-నర్రా వాసు-టీడీపీ
20 . పెడన-మల్లేశ్వరం (హెచ్‌క్యూ) బంటుమిల్లి- ఒడుగు తులసీరావు -టీడీపీ
21.రైల్వే కోడూరు- కోడూరు -పగడాల వరలక్ష్మి – జనసేన
22.అనకాపల్లి -అనకాపల్లి-పచ్చికూర రాము-టీడీపీ
23. మైలవరం-మైలవరం -పొనకళ్ల నవ్యశ్రీ -జనసేన
24. మాడుగుల -మాడుగుల- పుప్పాల అప్పలరాజు -టీడీపీ
25. మచిలీపట్నం-మచిలీపట్నం – S. G. N వెంకట దుర్గా ప్రసాద్ (కుంచె నాని) -టీడీపీ
26. చంద్రగిరి -చంద్రగిరి -ఎస్.గౌష్ బాషా-టీడీపీ
27. ఉంగుటూరు-భీమడోలు- శేషపు శేషగిరి-టీడీపీ
28. జమ్మలమడుగు- జమ్మలమడుగు – సింగంరెడ్డి నాగేశ్వర రెడ్డి-టీడీపీ
29.మార్కాపురం-పొదిలి-సయ్యద్ ఇమామ్ సాహెబ్-టీడీపీ
30. గురజాల-పిడుగురాళ్ల-తురక వీరాస్వామి-టీడీపీ