స్టార్ హీరోయిన్ అనుష్క నిశ్శబ్ధం తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా చేసింది. ఆ తర్వాత అయినా కూడా వరుస సినిమాలు చేస్తుందని అనుకోగా అమ్మడు మళ్లీ అదే గ్యాప్ కొనసాగిస్తుంది. ఐతే క్రిష్ డైరెక్షన్ లో ఘాటి సినిమా చేస్తున్న అనుష్క ఆ సినిమాను అసలైతే ఏప్రిల్ లో రిలీజ్ చేయాలని అనుకోగా అది కాస్త వాయిదా పడింది. నిజ జీవిత సంఘటనలతో ఘాటి సినిమా తెరకెక్కిస్తున్నారు క్రిష్.
ఈ సినిమాతో మరోసారి అమ్మడు తన సత్తా చాటుతుందని భావిస్తున్నారు. క్రిష్ అనుష్క ఇద్దరు కలిసి ఇదివరకు వేదం సినిమా చేశారు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆఫ్టర్ లాంగ్ టైం మళ్లీ ఘాటితో ఈ ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఘాటి సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ లుక్ టీజర్ అనుష్క ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. తప్పకుండా సినిమా సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఉంటుందని అంటున్నారు.
ఘాటి సినిమా అప్డేట్స్ విషయంలో చిత్ర యూనిట్ చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తుంది. ఏప్రిల్ రిలీజ్ అనుకున్న సినిమా నుంచి ఒకే ఒక్క టీజర్ తప్ప మిగతా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. మరోపక్క ఘాటి సినిమా అసలు ఎప్పుడొస్తుంది అంటూ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కానీ మేకర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు. అనుష్క ఘాటి ఏప్రిల్ అన్నది ఈ ఇయర్ సెకండ్ హాఫ్ కి షిఫ్ట్ అవుతుందన్న టాక్ వస్తుంది. ముఖ్యంగా సమ్మర్ మిస్ అవుతున్న ఈ సినిమా దసరా రేసులో రావడం కూడా కష్టమే అనిపిస్తుంది. అందుకే సినిమాను ఇయర్ ఎండింగ్ కి అంటే డిసెంబర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని టాక్. డిసెంబర్ అంటే కుదిరితే ఫస్ట్ వీక్ లేదా క్రిస్ మస్ కి ఘాటిని వదిలే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. తప్పకుండా ఘాటి మీద ఉన్న అంచనాలకు సినిమా అదరగొడుతుందని చెబుతునారు. దీనితో పాటు అనుష్క మళయాళ సినిమాలో కూడా నటిస్తుంది. ఆ సినిమా విషయంలో కూడా ఆశించిన స్థాయిలో అప్డేట్స్ రావట్లేదు. అనుష్క చకచకా సినిమాలు చేస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నా అమ్మడు మాత్రం తన తీరు మార్చుకునే ఆలోచనలో లేదన్నట్టు తెలుస్తుంది. కమర్షియల్ సినిమాలు చేయకపోయినా ఫిమేల్ సెంట్రిక్ సినిమాలైనా చేసి ఫ్యాన్స్ ని మెప్పించాలని కోరుతున్నారు.