ఆంధ్రప్రదేశ్‌లో ఏడు కొత్త విమానాశ్రయాలను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని ప్రకటించారు.
ఏపీలో ఇప్పటికే విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, కడప, కర్నూలు విమానాశ్రయాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయిభోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.ఇవి కాకుండా కొత్తగా కుప్పం, దగదర్తి, తాడేపల్లి గూడెం, నాగార్జున సాగర్, తుని-అన్నవరం, ఒంగోలు, శ్రీకాకుళంలో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
విజయవాడకు సమీపంలో గన్నవరం విమానాశ్రయం ఉన్నప్పటికీ, అమరావతిలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం అవసరమని సీఎం చంద్రబాబు ఇటీవల అన్నారు.ఇవన్నీ పూర్తయితే ఉమ్మడి జిల్లాల పరిధిలో దాదాపు ప్రతి జిల్లాకు ఎయిర్‌పోర్ట్ ఉన్నట్లే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా జిల్లాకొక ఎయిర్ పోర్టు అని పదేపదే చెప్తుండేవారు.
ప్రస్తుతం విమానాశ్రయాలు నిర్మించాలని సూచిస్తున్న ప్రాంతాల్లోని బస్‌స్టాండ్లలో సరైన సౌకర్యాలు లేవు.రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. పాడైన రోడ్లకు రిపేర్లే తప్ప, కొత్తగా రోడ్లను నిర్మించలేని పరిస్థితి ఉంది.పరిస్థితులు ఇలా ఉంటే, ప్రభుత్వాలు పదే పదే ఎయిర్‌పోర్టుల నిర్మాణం గురించి ప్రకటనలు చేయడంపై క్షేత్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
ఏపీలో అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని స్థానికుల నుంచి డిమాండ్ ఉంది.గ్రీన్ హెడ్రోజన్ హబ్, ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ వంటి భారీ పరిశ్రమలు రానున్న పాయకరావుపేటకు విమానాశ్రయం అవసరమని సీఎం చంద్రబాబు కూడా అన్నారు.
పర్యాటక కేంద్రం అరకులో కూడా ఎయిర్‌పోర్టు ఏర్పాటు ప్రతిపాదన పరిశీలనలో ఉందని, ఇప్పటికే సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖకి ప్రతిపాదన తీసుకు వెళ్లినట్టు అరకు ఎంపీ తనూజా రాణి చెప్పారు.పలాసలో కూడా తమకి ఎయిర్ పోర్టు కావాలని అక్కడ కొంత కాలంగా డిమాండ్ వినిపిస్తోంది.ఇలా రాష్ట్రంలో పలు చోట్ల ఎయిర్ పోర్టుల ఏర్పాటు గురించి ప్రస్తావిస్తున్నారు. ఈ డిమాండ్లను పరిశీలించిన తర్వాత మనకి కావాలసిన చోటల్లా ఎయిర్‌పోర్టులు పెట్టుకోవచ్చా? అనే చర్చ జరుగుతోంది.
రాష్ట్రంలోని కొన్ని ఎయిర్ పోర్టులలో ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ప్రపోజల్స్ ఉన్న అన్ని జిల్లాల్లో ఎయిర్ ప్యాసింజర్ల సంఖ్య తగినంత లేకపోవచ్చునని ఆంధ్రప్రదేశ్ విమాన ప్రయాణికుల సంఘం ప్రతినిధి, విశాఖ విమానాశ్రయం అడ్వైజరీ మెంబర్ నరేష్ కుమార్ చెప్పారు.అసలు ఒక ప్రాంతంలో ఎయిర్ పోర్టు పెట్టాలంటే ముందుగా కొన్ని అంశాలను కేంద్ర విమానాయనశాఖ పరిగణలోకి తీసుకుంటుందన్నారు.
విమాన ప్రయాణాలు ప్యాసింజర్లకు ధరలపరంగా అందుబాటులో ఉండాలి.కనీసం 2 వేల నుంచి 3 వేల మంది రోజూ ప్రయాణించే అవకాశమున్న ప్రాంతంలోనే విమనాశ్రయం నిర్మించేందుకు ప్రతిపాదించే అవకాశం ఉంటుందన్నారు నరేష్ కుమార్.శ్రీకాకుళంలో ఎయిర్ పోర్టు నిర్మించి అది విజయవంతంగా నడవాలంటే, అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి, పాయకరావుపేటలలో ఎలాగైతే రూ. 2 లక్షల కోట్లు పెట్టి గ్రీన్ ఎనర్జీ హబ్, రూ. 1.60 లక్షల కోట్ల మిట్టల్ స్టీల్, బల్క్ ఫార్మా వంటి భారీ పరిశ్రమలు వస్తున్నాయో…అలాగే శ్రీకాకుళం నుంచి ఒడిశాల మధ్య కూడా పరిశ్రమలు రావాలి. లేదంటే శ్రీకాకుళంలో ఎయిర్ పోర్టు ఆలోచన సరైనది కాదనే చెప్పాలి” అని నరేష్ కుమార్ అభిప్రాయపడ్డారు.
ఒకవేళ అన్ని అనుకున్నట్లే జరిగితే పాయకరావుపేట, శ్రీకాకుళం జిల్లాలలో కూడా ఎయిర్ పోర్టులు ప్రారంభమైతే…రాజమండ్రి, విశాఖ, భోగాపురం ఎయిర్ పోర్టులను కలిపి లెక్కిస్తే 300 కిలోమీటర్ల మధ్య 5 ఎయిర్ పోర్టులు ఉన్నట్లు అవుతుంది.ఇక్కడ రాష్ట్రంలో విమాన ప్రయాణికులు ఏ స్థాయిలో ఉన్నారన్నదే ప్రశ్న.
విమాన ప్రయాణికులు లేకపోతే విమానాశ్రయాలు కొన్ని రోజులకే ఆర్థికంగా నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నరేష్ కుమార్ తెలిపారు.భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభమైతే నేవీ నిర్వహణలో ఉన్న విశాఖ ఎయిర్ పోర్టును మూసేసే అవకాశం ఉందని చెప్పారు నరేష్ కుమార్.
‘అప్పుడు విశాఖ నుంచి 65 కిలోమీటర్లు దూరంగా ఉన్న భోగాపురం ఎయిర్ పోర్టు నుంచి విశాఖకు రాకపోకలు జరపాలంటే… విమాన టిక్కెట్ ధర కంటే క్యాబ్ టిక్కెట్ ధరే ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.దీనిని అధిగమించడం కోసం కోస్టల్ కారిడర్, భోగాపురం ఎయిర్ పోర్టును కలిపేందుకు హైవేలపై ఫ్లై ఓవర్లు, మెట్రో రైలు, భోగాపురం వరకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నగరం నుంచి వేస్తామన్న 12 రోడ్లు వెంటనే పూర్తి చేయాల్సి ఉంటుంది’ అన్నారు నరేష్ కుమార్.
మరో వైపు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం ఏపీలో విమాన ప్రయాణికులు పెరుగుతున్నారని నరేష్ కుమార్ చెప్పారు.విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 2024 డిసెంబరులో 2,75,694 మంది, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 1,40,625 మంది ప్రయాణికులు రాకపోకలు జరిపారని ఆయన చెప్పారు.
ఇక రాజమండ్రి, తిరుపతి విమానాశ్రయాల విషయానికొస్తే 2024 డిసెంబర్‌లో 51,332 మంది, తిరుపతి 1,02,739 ప్రయాణికుల రాకపోకలతో వృద్ధి రేటు సాధించాయని నరేష్ కుమార్ చెప్పారు.ఏటా ఎయిర్ పోర్టు అథారిటీ ఇచ్చే వీటి ర్యాంకులు కూడా మెరుగుపడ్డాయన్నారు. విమానాశ్రయాలలో ప్రయాణికుల సంఖ్య, భద్రత, సేవలు, కార్గో హ్యండ్లింగ్ వంటి అంశాలను పరిశీలించి పనితీరు ఆధారంగా విమానాశ్రయాలకు ర్యాంక్‌లు ఇస్తారు.
విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ 26వ ర్యాంక్, విజయవాడ విమానాశ్రయానికి 35వ ర్యాంక్, తిరుపతి 48, రాజమండ్రికి 53వ ర్యాంక్ పొందాయి.కాగా “ఒక ప్రాంతంలో ఎయిర్ పోర్టు ఎంతవరకు అవరసమనే సర్వే జరగాలి. ప్రజల ఆర్థిక పరిస్థితి, ఎంత మంది విమానాలు ఎక్కుతున్నారనే చూడాలి.
దేశంలో పెరుగుతున్న విమాన ప్రయాణికులు