నాయుడు అధ్యక్షతన మంత్రి మండలి మరోసారి సమావేశం కానుంది. మంగళవారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో మంత్రులు పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. రాజధాని అమరావతి సహా ఏపీ అభివృద్ధికి సీఎం చంద్రబాబు కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రేపు జరిగే సమావేశంలో రాజధాని, సీఆర్డీయే, నూతన అసెంబ్లీ, హైకోర్ట్ భవనాల నిర్మాణం వంటి కీలక అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు.సీఆర్డీయే 46వ అథారిటీలో ఆమోదించిన అంశాలన్నింటికీ ఏపీ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రాజధాని అమరావతి నిర్మాణం కోసం సీఆర్డీయే కమిషనర్ నిధులు సమీకరించుకునే అంశంపై మంత్రులు చర్చించనున్నారు. అనంతరం నిధుల సమీకరణకు క్యాబినెట్ అనుమతి ఇవ్వనుంది. అలాగే ఉండవల్లి, పెనుమాక రైతుల జరీబు భూములకు రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చే అంశంపై సీఆర్డీయే అథారిటీ తీసుకున్న నిర్ణయానికి క్యాబినెట్లో అనుమతి లభించనుంది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ నూతన అసెంబ్లీ, హైకోర్ట్ భవనాల టెండర్లకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. 5వ ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదించిన అంశాలకు సైతం క్యాబినెట్‌లో గ్రీన్ సిగ్నల్ పడనుంది. కొత్తగా రూ.30,667 కోట్ల పెట్టుబడులు.. 32,133 ఉద్యోగాలు కల్పించే ప్రతిపాదనలకూ ఆమోదముద్ర వేయనున్నారు మంత్రులు. అలాగే రాజధానిలో ఐటీ కంపెనీలకు నామమాత్రపు ధరకే భూకేటాయింపులు చేసే అంశంపైనా చర్చించి ఆమోదం తెలపనున్నారు.అమరావతి రాజధాని నిర్మాణం కోసం నిధులు సేకరించేందుకు సీఆర్డీఏకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. అమరావతిలో నిర్మించే హైకోర్టు, అసెంబ్లీ భవనాల టెండర్లు దక్కించుకున్న సందస్థలకు ఎల్ఓఏ ఇచ్చేందుకు ఆమోదం లభించనుంది. సీఆర్డీఏ నుంచి ఏడీసీకి 473 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు అవకాశం ఉంది. SIPB సమావేశంలో అమోదించిన వాటికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. కొత్తగా రూ.30,667 కోట్లు పెట్టుబడులు, 32,133 ఉద్యోగాలు వచ్చే ప్రతిపాదనలకు ఇప్పటికే అమోదం తెలపిన SIPB.. ఇక, ఐటీ కంపెనీలకు నామమాత్రపు ధరకే భూ కేటాయింపులు జరిగేలా మంత్రి మండలి ఆమోదం తెలపనుంది.