ఏ రాజకీయ నేత అయినా ప్రజల్లో తన పాపులారిటీ స్థిరంగా ఉండాలని కోరుకుంటారు. కానీ అది సాధించడమేగాక, దాన్ని నిలబెట్టుకోవడం ఎంతో కష్టమైన పని. గత ఎన్నికల తర్వాత ఏపీలో రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో ప్రభుత్వం ప్రజలకు దగ్గరగా ఉండేలా సాగిపోతోందనే ప్రశంసలు గట్టిగానే వస్తున్నాయి. ఇక ఆ విషయం కంటే ఎక్కువగా మరోవైపు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రజల నుంచి దూరమవుతున్నారనే విమర్శలు తమ పార్టీ నుంచే వినిపిస్తున్నాయి.ప్రస్తుతం చంద్రబాబుకు ఉన్న పాజిటివిటీ స్థాయి 80 శాతం వద్ద నిలిచిపోయిందని, కొన్ని జిల్లాల్లో ఇది మరింత పెరిగిందనే విశ్లేషణలు ఉన్నాయి. పింఛన్ల పంపిణీ, మహిళల పథకాలు, ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులకు బిల్లుల రీయింబర్స్‌మెంట్ వంటి నిర్ణయాలు ఈ ప్రభుత్వం పట్ల ప్రజల విశ్వాసాన్ని పెంచాయనేది టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు తరచూ ప్రజల మధ్య తిరుగుతూ వారి అభిప్రాయాలను తెలుసుకుంటూ తన పాలనను సమీక్షిస్తున్నారు.
పథకాలు కాస్త ఆలస్యం అయినా కూడా బాబు మ్యానేజ్ చేస్తున్న తీరు పార్టీలో పాజిటివ్ వైబ్ క్రియేట్ చేస్తోంది. కానీ జగన్ విషయంలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఎన్నికల తర్వాత కనీసం అసెంబ్లీలో గంట సేపైనా ఉండకుండా, ప్రజల్లో ప్రత్యక్షంగా కనిపించని స్థాయికి తగ్గిపోయారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయనకు సార్వత్రిక పబ్లిక్ కనెక్ట్ తక్కువగానే ఉండేది. పరధాలు కప్పడం వంటి అంశాలు నెగిటివ్ అయ్యాయి.
ఇప్పుడు అయితే అది కూడా పూర్తిగా కనుమరుగైంది. పార్టీ నేతలే ఈ విషయం గురించి గుసగుసలాడుతున్నారు. పాడేరు ఓటమి, ఎమ్మెల్యేలు పార్టీ మారిపోవడం వంటి అంశాలు జగన్ గ్రాఫ్‌పై ప్రభావం చూపాయని అంటున్నారు. ప్రస్తుతం జగన్ పాజిటివిటీ 10 శాతం దిగువకు వెళ్లిందనే టాక్ పార్టీ లోపల గట్టిగా వినిపిస్తోంది. అదే సమయంలో చంద్రబాబు పాలనలో ప్రజలకు అందిన మద్దతు పెరిగిపోవడంతో, వైసీపీ భవిష్యత్‌పై అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పుడు జగన్ మేల్కొనకపోతే, 2029లో పార్టీ స్థితిగతులు కష్టంగా మారే అవకాశం కనిపిస్తోంది. మరి ఈ గ్రాఫ్ గేమ్‌ను జగన్ తిరగరాయగలరా? అనేది వేచి చూడాలి.