ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ అనారోగ్య సమస్యలకు గురి అవుతూ హాస్పిటల్ పాలైనట్లు వార్తలు వచ్చాయి. ఇలా ఈయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన సతీమణి సైరా బాను రెహమాన్ ఆరోగ్యం గురించి సంచలన ప్రకటన చేశారు.
ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఈమె కోరుకున్నారు అంతేకాకుండా తన గురించి ఎవరైనా ప్రస్తావించేటప్పుడు దయచేసి రెహమాన్ గారి మాజీ భార్య అని మాత్రం అనొద్దని ఈమె అందరిని వేడుకున్నారు.తాము ఇంకా అధికారికంగా విడాకులు పొందలేదన్నారు. కొంతకాలంగా తాను అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్నానని.. అందుకే దూరంగా ఉంటున్నామని ఆమె వెల్లడించారు. అంతేకానీ విడాకులు తీసుకోలేదని మరోసారి స్పష్టం చేశారు.
ఇలా తాము ఇంకా విడాకులు తీసుకోలేదని దయచేసి ఎవరూ కూడా మాజీ భార్య అని పిలవద్దు అంటూ చెప్పడంతో రెహమాన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరి తమ విడాకులను రద్దు చేసుకొని తిరిగి కలిసిపోతే బాగుంటుంది అంటూ ఆకాంక్షిస్తున్నారు. ఇక రెహమాన్ సైరా భాను 1995లో పెళ్లి చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు. 29 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత వీరు విడిపోతున్నట్లు కట్టించారు.
ఇదే విషయం గురించి రెహమాన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ త్వరలో మా వైవాహిక బంధం 30 సంవత్సరాలలోకి అడుగుపెడుతుందని సంతోషించేలోపు అనుకోని విధంగా ముగింపు పలకాల్సి వచ్చింది. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో స్నేహితులు మా వ్యక్తిగత గోప్యతను అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం అంటూ పోస్ట్ చేసారు.