అనంతపురం – బెంగళూరు రైలుకు భారత రైల్వే శాఖ ఆమోదం
అనంతపురం ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం నుంచి నడుస్తున్న MEMU రైలు అనంతపురం వరకు పొడిగిస్తూ భారత రైల్వే శాఖ ఏప్రిల్ 15, 2025 న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నిర్ణయం అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారి నిరంతర కృషికి ప్రతిఫలం. పార్లమెంట్‌లో డిమాండ్ చేయడంతో పాటు, రైల్వే అధికారులను పలు మార్లు కలసి, సమస్యను బలంగా విన్నవించటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు.అనంతపురంసామాన్య ప్రజల అనేక సంవత్సరాల కోరికకు భారత రైల్వే శాఖ స్పందించింది. శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం నుంచి బెంగళూరుకు నడుస్తున్న MEMU రైలును అనంతపురం వరకు పొడిగిస్తూ కేంద్ర రైల్వే బోర్డు 2025 ఏప్రిల్ 15 న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.ఈ సుస్థిర నిర్ణయం అనంతపురం ఎంపీ శ్రీ అంబికా లక్ష్మీనారాయణ గారి నిరంతర కృషితో, పట్టు, నిబద్ధతతో సాధ్యమైంది. ప్రజల ప్రయాణ అవసరాలను దృష్టిలో పెట్టుకొని, పార్లమెంట్ సమావేశాల్లో డిమాండ్ చేసి అనేకసార్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) మరియు దక్షిణ పశ్చిమ రైల్వే (SWR) జనరల్ మేనేజర్లను కలిసి, పుట్టపర్తి-బెంగళూరు రైలును అనంతపురం వరకు పొడిగించాల్సిన అవసరాన్ని వివరించారు.
ఈ విషయాన్ని పరిష్కరించేందుకు కేంద్ర రైల్వే సహాయ మంత్రి శ్రీ వీరన్న సోమన్న గారిని వ్యక్తిగతంగా కలుసుకొని, ఆయన్ను ఈ అంశంలో జోక్యం చేసుకుని పుట్టపర్తి – బెంగుళూరు రైలు ను అనంతపురం వరుకు పొడిగించాలనీ కోరారు. వారి సహకారంతో, రెండు రైల్వే జోన్‌లను ఒప్పించి, ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అనంతపురం ప్రజలకు రైలు సౌకర్యాన్ని పూర్తిగా అందజేయగలిగారు.ఈ పొడిగింపు వల్ల ఇకపై అనంతపురం నుంచి బెంగళూరు వెళ్లేందుకు సులభంగా ప్రయాణించవచ్చు. ఇది సామాన్య ప్రయాణికుల మాత్రమే కాకుండా విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపార వర్గాలకు ఎంతో ఉపశమనం కలిగించనుంది.ఇప్పటి వరకు ఉన్న స్టాపేజ్ తో పాటు సోమేశ్వర, విధు రాస్వర్థం, కొత్త చెరువు, బాసంపల్లె, చిగిచెర్ల, జంగా లపల్లె, ప్రసన్నాయనపల్లి స్టేషన్లు లో కూడా ఈ రైలు స్టాపింగ్ సదుపాయం ఇస్తూ ఈ పొడిగింపు ప్రయాణ మార్గంలో కలపబడ్డాయి.ఈ రైలు పొడిగింపు అనంతపురం జిల్లాకు ఆర్థిక, సామాజిక ప్రగతికి ఊతమిచ్చే నిర్ణయం కావడమే కాకుండా, రవాణా అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలవనుంది.
ఈ సందర్భంగా అనంతపురం ఎంపీ శ్రీ అంబికా లక్ష్మీనారాయణ గారు భారత ప్రభుత్వ రైల్వే శాఖకు, రైల్వే అధికారులకు, కేంద్ర సహాయ మంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ – అతి త్వరలోనే కేంద్ర రైల్వే మంత్రి గారి చేతుల మీదుగా ఈ సేవ త్వరలోనే అమలులోకి రానుందని తెలిపారు.ఈ రైలు అనంతపురం స్టేషన్ నుండి మధ్యాహ్నం గం 2.10 నిముషాలకు బయలుదేరి సాయంత్రం 7 గంటలకు బెంగళూరు స్టేషన్ చేరుకుంటుంది.