తెలుగు చిత్ర పరిశ్రమలు(TollyWood )ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిపోయిన వారిలో మలయాళీ ముద్దుగుమ్మ(Honey Rose) హనీ రోజ్ ఒకరు. ఈమె గతంలో పలు తెలుగు సినిమాలలో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు
కానీ ఇటీవల బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలో ఈమె రెండు విభిన్న పాత్రలలో నటించారు. ఒకటి బాలయ్యకు తల్లిగాను అలాగే భార్య పాత్రలో కూడా ఈమె నటించారు.
ఈ సినిమాలో హాని రోజ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇలా ఈ సినిమా తర్వాత ఈమెకు సినిమా అవకాశాలు రాకపోయినప్పటికీ మాత్రం సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.
అదేవిధంగా ఎన్నో షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు వెళుతూ కూడా ఈమె ఎంతో బిజీగా గడుపుతున్నారు. తెలుగులో ఎంతోమంది కుర్ర అభిమానులను సొంతం చేసుకున్న హనీ రోజ్ ఇటీవల ఓ కార్యక్రమంలో భాగంగా తన మనసులో కోరికను బయటపెట్టారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే సుమారు 20 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా తన కోరిక మాత్రం ఇండస్ట్రీలో నెరవేరలేదంటూ తన మనసులో కోరికను బయటపెట్టారు.తాను ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు అయిందని, తన హృదయానికి దగ్గరగా ఉండే పాత్ర ఇంకా రాలేదని తెలిపింది .
తాను సినిమాలలో నటించి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్న దాని కంటే కూడా షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాలకు వెళ్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నానని తెలిపారు.
ఇలా ఇండస్ట్రీలోకి వచ్చే రెండు దశాబ్దాలు అవుతున్న తన కోరిక మాత్రం తీరలేదంటూ ఈమె చెప్పడంతో తన హృదయానికి దగ్గరగా ఉండే పాత్రలను ఎవరైనా ఆమెకు కల్పిస్తూ తన కోరికను నెరవేర్చాలని అభిమానులు కోరుకుంటున్నారు.