రాజకీయాలలో తన,మన,మన కుటుంభం,వీర విధయత,నమ్మిన బంటు అనే పదాలకు కాలం చెల్లి చాలా రోజులు అయింది..ఒక తల్లికి ఇద్దరు కొడుకులు పుడితే తల ఒక పార్టీలో ఉంటున్నారు. ఆ కోవలో చూసినప్పుడు వైసీపీ ట్రబుల్ షూటర్,జగన్ నమ్మిన బంటు అని చెప్పుకునే వైసీపీ శ్రేణులకు విజయసాయి రెడ్డి రాజీనామాతో ఝలక్ ఇచ్చారు..
విజయసాయి రెడ్డి పార్టీకి రాజీనామా చేయాలి అనుకొని,ఒక స్టేజిలో నేను పార్టీ వదిలితే జగన్ మోహన్ రెడ్డికి నష్టం తప్ప నాకు నష్టం లేదని కొద్ది మంది ఎంపీలతో చెప్పడం..అధికారంలో ఉన్నప్పుడు జగన్ దూరం పెట్టడం అందరూ చూశారు.ఎన్నికలలో నెల్లూరు ఎంపీగా పోటీ చేయించడం..ఓడిపోవడంతో ఒక నిర్ణయానికి వచ్చి సమయం కోసం చూశారు..రాజీనామా చేసి బీజేపీకి ఒక రాజ్యసభ సీటు అందిస్తున్నారు.
ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్ లో విజయసాయి రెడ్డి రాజీనామా ముందుగా బీజేపీ పెద్దలకు చెప్పి చేశాడు కాబట్టి బీజేపీలోకి ఆహ్వానం అందింది.రాజీనామా తర్వాత వ్యవసాయం చేసుకుంటా అని ప్రకటన చేశారు.వ్యవసాయం చేస్తారా లేక రాజకీయాలు చేస్తారా అనేది ఇంకా తేల్చలేదు.
ఈ మధ్య ఉప రాష్ట్రపతి జగదీప్ దంఖర్ హైద్రాబాదు వచ్చినప్పుడు సాయి రెడ్డి ఆహ్వానం పలికారు.ఆయన కూడా సిట్టింగ్ ఎంపీల కంటే ఈయనకు ఎక్కువ విలువ ఇచ్చారు.బీజేపీలోకి ఎంట్రీ ఖరారు అయింది.అయితే ఇప్పుడు బీజేపీలో చేరితే జగన్ మోహన్ రెడ్డిని వెన్నుపోటు పొడిచారు అనే విమర్శలు వస్తాయి అనే కారణంతో తాత్కాలికంగా వాయిదా వేశారు..
బీజేపీలో చేరితే ఆయన కోరుకున్న గవర్నర్ గిరి దక్కుతుందా!విజయసాయిరెడ్డి బీజేపీలో చేరుతారు అన్నది టీడీపీ కూటమి పెద్దలకు కూడా ఒక ఐడియా ఉందని అంటున్నారు. నిజానికి విజయసాయిరెడ్డికి బీజేపీ పెద్దలతో మంచి పరిచయాలు ఉన్నాయి. అందుకే ఆయన తాను రాజ్యసభ నుంచి తప్పుకుంటున్నపుడు ప్రత్యేకించి మోడీ అమిత్ షాలకు స్పెషల్ థాంక్స్ చెప్పారు.
విజయసాయి రెడ్డి బీజేపీలో చేరడానికి జూన్ నెలలో ముహూర్తం ఖరారు అయిందని పొలిటికల్ సర్కిల్స్ లో విపరీతమైన ప్రచారం జరుగుతుంది.ఉపరాష్ట్రపతిని కలవడానికి వచ్చిన విజయసాయి రెడ్డికి అడ్వాన్స్ కంగ్రాట్స్ చెప్పారట. ఇంతకీ ఎందుకు ? అనే ప్రశ్న అందరి మదిని తొలుస్తోంది.విజయసాయిరెడ్డిని తమిళనాడు రాష్ట్ర గవర్నర్‌గా నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది.
విజయసాయిరెడ్డికి గవర్నర్ పదవి ఇచ్చి బీజేపీ రిటర్న్ ఏం ఆశిస్తోంది ? బీజేపీకి కొత్తగా ఒరిగేది ఏమీ లేదు కదా..!