ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , మంత్రి లోకేష్ ,కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనార్ధం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి వెళ్ళారు. చంద్రబాబు మనుమడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు కుటుంబంతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం తరిగొండ వెంగమాంబ అన్నదాన వితరణ కేంద్రంలో చంద్రబాబు కుటుంబసభ్యలతో కలిసి ప్రసాదాలు పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మనవడు నారా దేవాంశ్ పుట్టినరోజును పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, అర్చకులు.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు లాంఛనంగా స్వాగతం పలికారు.
శ్రీవారి దర్శనం అనంతరం వేదపండితులు రంగనాయకుల మండపంలో ఆశీర్వచనాలిచ్చారు. ఇదే సమయంలో స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా… నుదుటున నామం, సంప్రదాయ వస్త్ర ధారణతో చంద్రబాబు శీవారి దర్శనానికి వచ్చారు. స్వామివారి దర్శనార్ధం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయంలోకి ప్రవేశించారు.
మనవడు దేవాంశ్ పుట్టినరోజు కావటంతో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు! ఈ సందర్భంగా అన్నదాన కేంద్రంలో ప్రసాదాల పంపిణీకి ఒకరోజు అయ్యే ఖర్చును దేవాంశ్ పుట్టిన రోజు సందర్భంగా టీటీడీ అన్నదాన ట్రస్టుకు చంద్రబాబు విరాళంగా అందజేశారు. కాగా… నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. ఈ దఫా సీఎం హోదాలో రెండోసారి తిరుమల పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా.. వెంగమాంబ సత్రంలో దేవాంశ్ పేరుతో అన్నదానం నిర్వహించారు. ఈ క్రమంలో చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు స్వయంగా వడ్డించారు.
మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు పురస్కరించుకుని సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మణితో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకులు మండపంలో ఆలయ పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా.. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జే శ్యామలరావులు స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని, శ్రీవారి శేషవస్త్రాన్ని అందజేశారు. అంతకముందు సామాన్య భక్తుల్లా చంద్రబాబు కుటుంబం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయంలోకి ప్రవేశించారు. క్యూ కాంప్లెక్స్ వద్ద చంద్రబాబుకు టీటీడీ ఈవో శ్యామలరావు స్వాగతం పలికారు. ఆలయ మహా ద్వారం వద్ద చేరుకున్న చంద్రబాబుకు శ్రీవారి ఆలయ అర్చకులు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరిలు ఇస్తికఫల్ స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు ధ్వజస్తంభాన్ని స్పృశించి, నమస్కరించి ఆలయ ప్రవేశం చేశారు.