Chandra Babu: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సినీ నటుడు చిరంజీవి పై ప్రశంశల వర్షం కురిపించారు..విజయవాడలో గురువారం నిర్వహించిన ‘మైండ్ సెట్ షిఫ్ట్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ కుమార్తె, మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కోడలు శరణి రచించారు. ఈ క్రమంలోనే పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా తొలి పుస్తకాన్ని చిరంజీవికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ చిరంజీవి పై ప్రశంసల వర్షం కురిపించారు.పాజిటివ్ థింకింగ్, బలమైన అంకితభావమే సక్సెస్ సాధించడంలో తోడ్పడతాయని చంద్రబాబు అన్నారు. చిరంజీవి ఒక సాధారణ కుటుంబం నుంచి నటుడు కావాలి అని బలమైన సంకల్పంతో ఇండస్ట్రీలోకి వచ్చి తన లక్ష్యాన్ని చేరుకున్నారని చంద్రబాబు తెలిపారు.
ఆయన మనస్తత్వం గొప్ప శిఖరాలకు చేరుకోవడానికి దోహదపడింది. ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, చిరంజీవి గారు అవకాశాన్ని ఉపయోగించుకుని, తీవ్ర కృషి, దృఢ సంకల్పంతో ఆ శూన్యాన్ని పూరించడం ద్వారా చిత్ర పరిశ్రమలో ఎదిగారు. అదేవిధంగా సామాజిక సేవ చేయాలనే ఒక గొప్ప ఆలోచనతో ముందుకు వచ్చిన మొదటి నటుడిగా చిరంజీవిని ప్రశంసించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నేను ఉన్న సమయంలో చిరంజీవి తరచూ నన్ను కలిసే వారిని తెలిపారు..బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు భూమి కేటాయించమని ఆయన నన్ను కోరారు. నటులు సినిమాను దాటి ప్రజా సేవపై దృష్టి పెట్టడం చాలా అరుదు. కానీ అలాంటి చొరవ తీసుకున్న మొదటి నటుడిగా చిరంజీవి గారు నిలిచారని చిరంజీవిపై చంద్రబాబు నాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.