సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) విజన్ చాలా గొప్పదని ప్రముఖ వ్యాపార వేత్త మేఘా కృష్ణారెడ్డి(Businessperson Megha Krishna Reddy) అన్నారు. వెలగపూడిలో పీ4 కార్యక్రమం(P4 program) ప్రారంభోత్సవంలో చంద్రబాబు(Chandrababu), పవన్ కల్యాణ్(Pawan Kalyan)తోపాటు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేఘా కృష్ణారెడ్డి మాట్లాడుతూ పీ-4 గేమ్ ఛేంజర్ అని చంద్రబాబు చెప్పారని తెలిపారు. గుడ్లవల్లేరును దత్తత తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారని, ఈ మేరకు అక్కడ సర్వే నిర్వహించామని చెప్పారు. చాలామందికి ప్రభుత్వ స్కీమ్‌లు తెలియదన్నారు. వ్యాపారంలో సక్సెస్ కాకపోతే వ్యవసాయం చేసుకునేవాడినన్నారు. 20 రాష్ట్రాలతో పాటు ప్రపంచంలో 20 దేశాల్లో చాలామంది నేతలతో కలిసి పని చేస్తున్నామని మేఘా కృష్ణారెడ్డి పేర్కొన్నారు.