నటీనటులు: విక్కీ కౌశల్-రష్మిక మందన్నా-అక్షయ్ ఖన్నా-డయానా పెంటీ- ప్రదీప్ రావత్-నీల్ భూపాలం-అశుతోష్ రాణా-దివ్య దత్తా తదితరులు సంగీతం: ఏఆర్ రెహమాన్ ఛాయాగ్రహణం: సౌరభ్ గోస్వామి నిర్మాత: దినేశ్ విజాన్
రచన: లక్ష్మణ్ ఉటేకర్-రిషి విర్మాని-కౌశబ్ సవార్కర్-ఉన్మన్ బాంకర్-ఓంకార్ మహాజన్ దర్శకత్వం: లక్ష్మణ్ ఉటేకర్ ఛావా.. గత మూడు వారాలుగా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తున్న హిందీ చిత్రం. ఛత్రపతి శివాజీ తనయుడు శంబాజీ మహరాజ్ జీవిత కథ ఆధారంగా విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో లక్ష్మణ్ ఉటేకర్ రూపొందించిన చిత్రమిది. ఇప్పుడీ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ తెలుగులోకి తీసుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి. కథ: ఛత్రపతి శివాజీ మరణంతో ఈ కథ ఆరంభమవుతుంది. శివాజీ చనిపోవడంతో మరాఠా సామ్రాజ్యం కుప్పకూలిపోతుందని మొఘల్ రాజు భావించి ఔరంగజేబు (అక్షయ్ ఖన్నా) సంబరాలకు సిద్ధమవుతాడు. కానీ శివాజీ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన తనయుడు శంభాజీ (విక్కీ కౌశల్).. మొఘలులకు అడ్డుగోడగా నిలుస్తాడు. మొఘల్ సామ్రాజ్యం మీద తన సైన్యంతో దాడి కూడా చేస్తాడు. ఐతే శంభాజీని ఎలాగైనా పడగొట్టాలని పంతం పట్టిన ఔరంగజేబు.. అది అంత తేలిక కాదని అర్థం చేసుకుంటాడు. దీంతో కుట్రపూరితంగా శంభాజీని పడగొట్టడానికి ఎత్తుగడ వేస్తాడు. మరి ఆ ప్రయత్నంలో అతను విజయవంతం అయ్యాడా.. శంభాజీ ఔరంగజేబు చేతికి చిక్కాడా.. చివరికి అతడి కథకు ముగింపేంటి అన్నదే ‘ఛావా’. కథనం-విశ్లేషణ: ఛావా.. దేశవ్యాప్తంగా మూడు వారాలుగా మార్మోగిపోతున్న పేరిది. ఉత్తరాది జనాలు ఈ సినిమా చూసి థియేటర్లలో ఉద్వేగానికి గురవుతున్న తీరు చూసి.. నిజంగా అంత గొప్పగా ఏముందీ సినిమాలో అని మన వాళ్లలో కూడా కుతూహలం కలిగింది. కొంచెం ఆలస్యం అయినా దీన్ని ఇప్పుడు గీతా సంస్థ తెలుగులోకి తీసుకొచ్చింది. అయితే రాజులు.. రాజ్యాల కథలు మనకు కొత్తవి కావు. అందులోనూ ‘బాహుబలి’ ఇచ్చిన హై తర్వాత.. ఇలాంటి ఓ కథతో మనవాళ్లను మెప్పించడం సవాలుగా మారింది. వివిధ భాషల నుంచి భారీ ప్రయత్నాలు కొన్ని బెడిసికొట్టాయి కూడా. బాలీవుడ్ నుంచి కూడా ‘బాజీరావు మస్తానీ’ లాంటి సినిమాలు వచ్చాయి. వెళ్లాయి. కానీ పెద్దగా స్పందన లేకపోయింది. ఐతే ‘ఛావా’ వాటన్నింటికీ భిన్నం. ‘బాహుబలి’లా ఇందులో భారీతనం ఉండదు. ఇదేమీ విజువల్ వండర్ అనిపించదు. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే సన్నివేశాలుండవు. కానీ భావోద్వేగాలను పతాక స్థాయికి తీసుకెళ్లి ప్రేక్షుకులను కదిలించడంలో మాత్రం ‘ఛావా’ ఏ గొప్ప సినిమాకూ తీసిపోదు. ఎక్కడా కథ నుంచి పక్కకు వెళ్లకుండానే హీరో పాత్రకు అదిరిపోయే ఎలివేషన్ ఇవ్వడంలో దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ విజయవంతం అయ్యాడు. ఇక ఎమోషనల్ హై గురించి చెప్పాల్సిన పనే లేదు. ఈ కథతో కనెక్ట్ అయిన వాళ్లకు సినిమా చివరికొచ్చేసరికి గుండె బరువెక్కి.. కళ్లు తడి అవ్వడం ఖాయం.
చరిత్రను ఎవరికి నచ్చినట్లు వాళ్లు రాసుకున్నట్లే.. సినిమా కథలను సైతం ఎవరికి నచ్చిన శైలిలో వాళ్లు చెబుతారు. ‘ఛావా’ కూడా ఒక కోణంలో సాగే కథ. మొఘల్ రాజుల గురించి మనం పుస్తకాల్లో చదువుకున్నది ఒకటైతే వాస్తవంగా జరిగింది వేరనే కోణంలో ఈ కథను నరేట్ చేశారు. వాళ్ల దురాగతాలకు అడ్డుగా నిలిచిన ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ కథను వీరోచితంగా చూపించాడు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్. భారత దేశం మొత్తాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చడం కోసం ఇక్కడి రాజ్యాల మీద ఔరంగజేబు పాశవికంగా దాడి చేస్తున్న దశలో అతడికి ఎదురు నిలిచిన శివాజీ హఠాత్తుగా మరణించిన దగ్గర ఈ కథ మొదలవుతుంది. శివాజీ మరణంతో ఇక తనకు ఎదురు లేదనుకున్న దశలో ఔరంగజేబుకు శంభాజీ ఎలా ఎదురు నిలిచి పోరాడాడన్నది చాలా ఎగ్జైటింగ్ గా చూపించారు ‘ఛావా’లో. శివాజీ గురించి చెప్పడానికి చాలా చరిత్ర ఉంది కానీ.. ఆయన తనయుడు శంభాజీ గురించి సామాన్య జనానికి తెలిసింది తక్కువ. చరిత్రలో ఏముందో కానీ.. ఈ సినిమాలో అతడి పాత్రను చూస్తుంటే మాత్రం ఉద్వేగం కలుగుతుంది. తన వీరత్వాన్ని చాటే తొలి ఎపిసోడే ఒక క్లైమాక్స్ చూస్తున్న ఫీలింగ్ కలిగిస్తుంది. శత్రువుల మీద సింహంలా పడిపోవడమే కాదు.. నిజంగా ఓ సింహంతోనే పోరాడే సన్నివేశం హీరో పాత్రకు అదిరిపోయే ఎలివేషన్ ఇస్తుంది. ఐతే హీరో ఇంట్రో ఎపిసోడ్ తర్వాత కథనం కొంచెం నెమ్మదిగానే నడుస్తుంది. కోట లోపలి వ్యవహారాలు.. సన్నివేశాలు కొంచెం మామూలుగానే సాగిపోతాయి. ఔరంగజేబు పాత్ర అప్పుడప్పుడూ మెరుపులు మెరిపిస్తుంటుంది. ప్రథమార్ధం అయ్యేసరికి ‘ఛావా’ ఓ మోస్తరుగానే అనిపిస్తుంది. హిందీ ఆడియన్స్ అంతగా ఉద్వేగానికి గురయ్యేంతగా ఏముంది ఇందులో అనిపిస్తుంది. కానీ అసలు కథ తర్వాతే మొదలవుతుంది. ఔరంగజేబు మీద శంభాజీ తన సైన్యంతో మెరుపు దాడులు చేసే సీన్లతో ‘ఛావా’ ఊపందుకుంటుంది. ఇక ఆ తర్వాత తనకు వ్యతిరేకంగా కుట్ర …