మెగాస్టార్ చిరంజీవి, సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసింది. ఈ సినిమాకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం పూజా కార్యక్రమం ఉగాది రోజున జరగనుందని తెలుస్తోంది. ఈ వార్త మెగా ఫ్యాన్స్ లో జోష్ నింపుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై ప్రేకకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
చిరు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం కామెడీ ఓరియెంటెడ్ గా ఉంటుందని… ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జూన్ నుంచి ప్రారంభంకానుందని, 2026 సంక్రాంతికి సినిమా విడుదల కానుందని సమాచారం. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తుండగా… భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.
ఉగాది పండగ సందర్భంగా మార్చి 30న ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభించాలని మేకర్స్ నిర్ణయించారు. అదేవిధంగా జూన్ నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ షురూ చేసి.. వచ్చే సంక్రాంతికి సినిమా విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారట అనిల్ రావిపూడి. ఈ మేరకు వరుస షెడ్యూళ్లలో శరవేగంగా షూటింగ్ పూర్తి చేయాలని నిర్ణయించారట.
ఈ సినిమాలో చిరంజీవి డ్యూయెల్ రోల్‌లో నటించనున్నారట. మంచి మెసేజ్ పాయింట్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే కథతో ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. చిరంజీవి కామెడీ యాంగిల్స్ తో థియేటర్స్ హోరెత్తిపోయేలా అనిల్ ప్లాన్ చేస్తున్నారట అనిల్ రావిపూడి. నిజానికి చిరంజీవి డ్యూయెల్ రోల్ చేసి చాలా సంవత్సరాలు అయింది. దీంతో ఈ న్యూస్ మెగా అభిమానులకు కిక్కిస్తోంది. అనిల్ రావిపూడి స్టైల్ మేకింగ్ లో చిరంజీవి డ్యూయల్ రోల్ అంటే ఇక మామూలుగా ఉండదని చెప్పుకుంటున్నారు.
చాలా కాలం తర్వాత చిరంజీవి పూర్తి స్థాయి వినోదాత్మక పాత్రలో కనిపించనున్నాడు. యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ మేళవింపుతో రూపొందుతున్న ఈ సినిమా మెగా ఫ్యాన్స్‌లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. చిరంజీవికి జోడీగా ఇద్దరు హీరోయిన్లు నటించే అవకాశముందని, ఓ పాత్ర కోసం అదితీ రావు హైదరి పేరును పరిశీలిస్తున్నట్లు టాక్ బయటకొచ్చింది. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. అనిల్ రావిపూడి మార్క్ వినోదం, చిరంజీవి ఎనర్జీ ఈ సినిమాలో చూడనున్నామట.