జపాన్‌లో వారం రోజుల పర్యటన ముగించుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం నేడు హైదరాబాద్ రానుంది. ఈనెల 15న హైదరాబాద్ నుంచి వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి, ఉన్నతాధికారులు, జపాన్‌లో వివిధ నగరాల్లో ప్రముఖ సంస్థల అధిపతులతో భేటీ అయ్యారు. ఈ పర్యటనలో మొత్తం 12 వేల 62 కోట్ల రూపాయల పెట్టుబడులపై ఒప్పందాలు జరిగాయి. వీటి ద్వారా తెలంగాణలో దాదాపు 30,500 ఉద్యోగావకాశాలు లభించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
హైదరాబాద్ ఫ్యూచర్‌సిటీలో 600 ఎకరాల్లో సుమారు వెయ్యి కోట్ల రూపాయల ప్రారంభ పెట్టుబడితో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసేందుకు మారుబెనీ సంస్థ ముందుకొచ్చింది. భవిష్యత్తులో ఈ మొత్తం రూ.5,000 కోట్లకు చేరుకుందని అంచనా వేసింది. హైదరాబాద్‌లో రూ.10,500 కోట్లతో భారీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు జపాన్‌కు చెందిన ఎన్‌టీటీ డేటా, నెయిసా ముందుకొచ్చాయి. హైదరాబాద్ శివారులోని రుద్రారం వద్ద 562 కోట్ల రూపాయలతో మరో ఫ్లాంట్ ఏర్పాటు చేసేందుకు జపాన్ కంపెనీ తోషిబా ముందుకొచ్చింది. రుద్రారంలో ఇప్పటికే రెండు ఫ్యాక్టరీలను తొషిబా నిర్వహిస్తోంది. టోక్యోలోని సుమిద రివర్ ఫ్రంట్‌ను మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి బృందం పరిశీలించింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ నెల 16న జపాన్ వెళ్లిన సీఎం బృందం, వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా ఆహ్వానించింది. ఈ పర్యటన ఫలితంగా మొత్తం రూ. 12,062 కోట్ల పెట్టుబడులకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోవడం గమనార్హం. సోమవారం ఉదయం ముఖ్యమంత్రి హైదరాబాద్ చేరుకున్నారు.శంషాబాద్ విమానాశ్రయానికి చేరిన సీఎం రేవంత్‌కు కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్ర యువతకు భారీగా ఉద్యోగావకాశాలు ఏర్పడనున్నాయి. అధికారిక సమాచారం ప్రకారం, సుమారు 35,000 ఉద్యోగాలు ఈ పెట్టుబడుల ద్వారా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐటీ, పరిశ్రమల రంగాల్లో యువతకు గేట్లు తెరుచుకుంటాయన్న ఆశ కలుగుతోంది. అభివృద్ధిలో తెలంగాణను ముందుకు తీసుకెళ్లే దిశగా ఈ ఒప్పందాలను ప్రభుత్వం కీలకమైన అడుగుగా పేర్కొంది.
జపాన్‌కు చెందిన మారుబెని కంపెనీ హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కును స్థాపించేందుకు రూ. 1,000 కోట్ల పెట్టుబడితో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది మానవ వనరులకు అనుగుణంగా ఆధునిక పరిశ్రమలకు కేంద్రంగా మారనుంది. ఇదే సమయంలో, ఎన్టీటీ డేటా, నెయిసా సంస్థలతోనూ రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 10,500 కోట్ల పెట్టుబడికి ఒప్పందం చేసుకుంది.వీటి ద్వారా హైదరాబాద్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మొత్తం పర్యటన ద్వారా సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణలో పెట్టుబడుల హబ్‌గా అభివృద్ధి చెందించాలన్న దిశగా మరో కీలక ఘట్టం ప్రారంభించినట్లైంది. జపాన్ సంస్థలు తెలంగాణపై చూపిన ఆసక్తి, భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ పెట్టుబడులకు బాటలు వేయవచ్చన్న నమ్మకాన్ని కలిగిస్తోంది.
జపాన్‌లో తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు పలు కంపెనీలతో ముఖ్యమంత్రి బృందం ఒప్పందాలు చేసుకుంది. టీఈఆర్‌ఎన్, రాజ్ గ్రూప్ ఏజెన్సీలతో రాష్ట్ర కార్మిక శాఖ పరిధిలోని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్… టామ్‌కామ్ ఒప్పందాలు జరిగాయి. హైదరాబాద్‌లో ఎకోటౌన్ అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర బృందం జపాన్‌లో పర్యావరణ హిత కిటాక్యూషు నగరాన్ని సందర్శించి.. ఈఎక్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, పీ9 ఎల్ఎల్‌సీ, నిప్పాన్ స్టీల్ ఇంజినీరింగ్, న్యూ కెమికల్ ట్రేడింగ్, అమితా హోల్డింగ్స్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. కిటాక్యూషు మాదిరిగా హైదరాబాద్‌ను శుభ్రమైన, సుస్థిర నగరంగా తీర్చిదిద్దే దిశగా ఈ ఒప్పందాలు జరిగాయి.టోక్యోలోని సుమిద రివర్ ఫ్రంట్, కిటాక్యూషులోని మురాసాకి రివర్ ఫ్రంట్‌లను సీఎం బృందం సందర్శించింది. మూసీ పునరుజ్జీవనం కోసం అనుసరించాల్సిన విధానాలపై అధ్యయనం చేసింది. నిన్న హిరోషిమా నగరాన్ని సందర్శంచి డిప్యూటీ గవర్నర్, అసెంబ్లీ స్పీకర్‌ను ముఖ్యమంత్రి బృందం కలిసింది. హిరోషిమా, తెలంగాణ మధ్య సంబంధాలపై వారు చర్చించారు.