అనంతపురం :
*రూ. 32.40 లక్షలు విలువచేసే 36 తులాల బంగారు నగలు, 3 బైకులు స్వాధీనం*
💥 *చైన్ స్నాచర్ల ముఠాల పట్టివేత… నలుగురు అంతర్ జిల్లా చైన్ స్నాచర్ల ను అరెస్ట్ చేసిన అనంతపురము రూరల్, నాల్గవ పట్టణ పోలీసులు*
💥 *ఒంటరిగా వెళ్లే మహిళలను టార్గెట్ చేసి చైన్ స్నాచింగ్ లకు పాల్పడినట్లు విచారణలో వెల్లడి*
💥 *పేకాట, క్రికెట్ బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్ ల జోలికెళ్లి అప్పులపాలై చైన్ స్నాచర్లగా అవతారమెత్తి పోలీసులకు చిక్కిన వైనం*
💥 *జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ IPS గారి ఆదేశాల మేరకు చైన్ స్నాచింగ్ నేరాలకు చెక్ పెట్టిన అనంతపురం పోలీసులు*
💥 *బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించి చైన్ స్నాచర్ల ముఠా అరెస్టు, తదితర వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు*
**** *అరెస్ట్ అయిన నింధితుల వివరాలు* ****
(1) కె.పంపాచారి @ నరేశ్, వయస్సు 34 సంలు., రాజీవ్ కాలనీ పంచాయతీ, అనంతపురము
ఇతను కార్పెంటర్ మరియు డ్రైవింగ్ పని చేస్తూ జీవనం కొనసాగించేవాడు. పేకాట, క్రికెట్ బెట్టింగ్ లకు అలవాటు పడి సంపాదన అంతా ఈ వ్యసనాలకే ఖర్చు పెట్టేవాడు. కుటుంబ పోషణ, తన వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడానికి చైన్ స్నాచింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.
(2) షేక్ షాకీర్, వయస్సు 27 సం.లు, రాయల్ నగర్, అనంతపురము
ఇతను కూడా కార్పెంటర్ . ఈ వృత్తితో పాటు ప్రస్తుతం ఇతను స్థానిక రాయల్ నగర్ లో ఫర్నీచర్ షాప్ పెట్టుకొని సొంతంగా పని చేసుకుంటున్నాడు. వ్యాపారము సరిగా జరగలేదని అప్పులు ఎక్కువ అయ్యాయి. వీటిని తీర్చుకోవడానికి కె.పంపాచారితో కలిసి ఇద్దరు చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డారు.
(3) కంబం నాగార్జున @ చిన్న, వయస్సు 24 సం.లు, నల్లమడ మండల కేంద్రం, శ్రీసత్యసాయి జిల్లా (ప్రస్తుతం ఇతను స్థానిక సుఖదేవనగర్ లో నివాసం ఉంటున్నాడు)
స్వగ్రామమైన నల్లమాడ నుండి ఇతను బతుకు తెరువు కోసం కుటుంబం సహా ఏడాదిన్నర కిందట అనంతపురం చేరాడు. డ్రైవరు గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు . 4 నెలల కిందట కె.పంపాచారి @ నరేశ్ పరిచయం అయ్యాడు. ఇద్దరూ స్నేహితులుగా మారి …ఇద్దరు కలిసి పేకాట , ఆన్లైన్ జూదము ఆడేవారు . ఈ వ్యసనాలలో డబ్బులు పోగొట్టుకుని అప్పులపాలు అయ్యాడు . వీటిని తీర్చుకునే క్రమములో చైన్ స్నాచింగ్ ల బాట పట్టాడు
(4) * షేక్ ఫజిల్ అహ్మద్ @ షేక్ ఫజిజ్ అహ్మద్, వయస్సు: 25 సంవత్సరాలు, ప్రియాంక నగర్, అనంతపురము టౌన్.
ఇతను ప్రైవేట్ డ్రైవర్ గా పనిచేసేవాడు. ఆన్లైన్ బెట్టింగ్లు, తదితర వ్యసనాలకు అలవాటు పడి అప్పులపాలయ్యాడు . అప్పు ఇచ్చిన వారినుండి చెల్లించమని వత్తిడి తీవ్రం కావడము … తనకు పెళ్లి ఖరారు అయి, పెండ్లి ఖర్చులకు అవసరమైన డబ్బులు లేకపోవడము వలన ఎలాగైనా సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. చైన్ స్నాచింగ్ల బాట పట్టాడు .
** *నేపథ్యం* :
ప్రస్తుతం అరెస్టయిన నలుగురిలో కె.పంపాచారి @ నరేశ్ ముఖ్యుడు. తనకున్న అప్పులను తీర్చుకోవాలని భావించి సులువుగా డబ్బు సంపాదించాలని ఆలోచించి చైన్ స్నాచింగులు చేయాలనుకున్నాడు. తనతో పాటు అప్పులతో సతమతం అవుతున్న తన స్నేహితులైన షేక్ షాకీర్, కంబం నాగార్జున, @ చిన్నలను కలుపుకున్నాడు. మొత్తం మూడు ముఠాలుగా ఏర్పాటు చేసుకున్నాడు. తనొక్కడే ఒక ముఠాగా…తను, షేక్ షాకీర్ రెండవ ముఠాగా… తను, కంబం నాగార్జున, @ చిన్న కలిసి మూడవ ముఠాగా ఏర్పడి చైన్ స్నాచింగులకు ఒడిగట్టాడు. ఒకరికి తెలియకుండా మరొకర్ని చేర్చుకుని మిగితా ఇద్దరితో కలిసి చైన్ స్నాచింగులు చేశాడు. షేక్ ఫజిల్ అహ్మద్ @ షేక్ ఫజిజ్ మాత్రం ఒక్కడే స్నాచింగులు చేశాడు.
💥 *ఒంటరిగా వెళ్లే మహిళలే టార్గెట్* …
ఒంటరిగా వెళ్లే మహిళల్ని టార్గెట్ చేసి కె.పంపాచారి @ నరేశ్ ఒక్కడే చైన్ స్నాచింగులకు పాల్పడ్డాడు. టూవీలర్ పై ఇతనొక్కడే వెళ్లి శివారు కాలనీలు/ప్రాంతాలలో ఒంటరిగా వెళ్తున్న మహిళలు మెడలో ధరించిన బంగారు నగలును లాక్కొని అదే టూవీలర్ పై పరారు కావడం అలవాటుగా చేసుకున్నాడు. ఇలా… 2023 సంవత్సరం నుండీ కురుగుంట, మన్నీల, రాప్తాడు, కళ్యాణదుర్గం రోడ్డు, గణేష్ నగర్, లలితానగర్ , ఒకటో రోడ్డు, తదితర ప్రాంతాలలో ఇతనొక్కడే 10 చైన్ స్నాచింగులు చేశాడు. రెండవ ముఠాగా షేక్ షాకీర్ తో కలిసి బైకుపై వెళ్లి కళ్యాణదుర్గం రోడ్డు, ద్వారకా విల్లాస్ లలో 02 స్నాచింగులు… కంబం నాగార్జునతో కలిసి హెచ్చెల్సీ రోడ్డు, స్టాలిన్ నగర్, బి.కె.సముద్రం చెరువు, బి.కొత్తపల్లి గ్రామాలలో 04 స్నాచింగులు చేశారు. మొత్తం 16 కేసుల్లో కె.పంపాచారి @ నరేశ్ నిందితుడు కాగా… ఈ 16 కేసుల్లోనే 02 కేసుల్లో షేక్ షాకీర్ , 04 కేసుల్లో కంబం నాగార్జున నిందితుడిగా ఉన్నారు. ఈ ముగ్గురు కూడా 2023 నుండీ స్నాచింగు నేరాలకు పాల్పడ్డారు.
💥* *షేక్ ఫజిల్ అహ్మద్ @ షేక్ ఫజిజ్ అహ్మద్ … ఒక్కడే*
షేక్ ఫజిల్ అహ్మద్ @ షేక్ ఫజిజ్ అహ్మద్ మాత్రం ఒక్కడే స్నాచర్ అవతారమెత్తాడు. ఇతడిని ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేవిధంగా తలకు ఎరుపు రంగు క్యాప్ ను పెట్టుకొని, ముఖానికి ఖర్చీఫ్ కట్టుకొని, తక్కువ జనసంచారము ఉన్న ప్రాంతాలలో స్కూటర్ల పైన వెళ్తున్న ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకొని, చైన్ స్నాచింగ్ నేరాలు చేయాలని పథకం వేసుకున్నాడు. ఇందులో భాగంగా (1) అనంతపురము మూడవ పట్టణ పోలీసు స్టేషన్ పరిదిలో గల శ్రీ శ్రీ నగర్ లో, HLC కెనాల్ పైన ఒంటరిగా ఒక స్కూటర్ లో వెళ్తున్న ఒక సచివాలయం మహిళా ఉద్యోగిని వెంబడించి, ఆమె మెడలో నుంచి బంగారు చైనును, (2) అనంతపురము నాల్గవ పట్టణ పోలీసు స్టేషన్ పరిదిలో గల ASR నగర్ ఎర్రమట్టి రోడ్ లో స్కూటర్ లో వెళ్తున్న మహిళా మెడలో నుంచి ఒక చైనును, మరియు (3) రాప్తాడు పరిదిలో గల కార్బన్ సిటీ వద్ద హైవే రోడ్ పైన స్కూటర్ పై వెళ్తున్న ఒక మహిళా మెడలో నుంచి ఒక బంగారు చైనును లాక్కొన్న దొంగతనాలకు పాల్పడ్డాడు.
** *అరెస్టు ఇలా* : అనంతపురం నగరం, పరిసర ప్రాంతాలు/ కాలనీలలో జరుగుతున్న చైన్ స్నాచింగులకు అడ్డుకట్ట వేయాలని జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు ఆదేశాలు జారీ చేశారు. అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశులు, అనంతపురము అర్బన్ డిఎస్‌పి శ్రీనివాస రావ్ గార్ల పర్యవేక్షణలో సి.ఐ లు శేఖర్, సాయినాథ్, ఇస్మాయిల్, జయపాల్ రెడ్డి… ఎస్సైలు రాజశేఖర్ రెడ్డి, రాంబాబు మరియు హెడ్ కానిస్టేబుల్ గిరిబాబు, కానిస్టేబుళ్లు శివయ్య, పాండవ, ప్రసాద్ లు బృందంగా ఏర్పడి ఇదే పనిలో నిమగ్నమయ్యారు. పక్కా రాబడిన సమాచారంతో ఈ పోలీసు బృందాలు వెళ్లి రాచానపల్లి మరియు రాయల్ నగర్, సుఖదేవనగర్ లలో ఈ ముగ్గురు చైన్ స్నాచర్ల ముఠాను వేర్వేరుగా అరెస్టు చేశారు.
** *ఈ ముఠా పాల్పడిన చైన్ స్నాచింగులు* :
అనంతపురము రూరల్ PS లో – 9 కేసులు, బుక్కరాయ సముద్రం PS – 2 కేసులు, ఇటుకలపల్లి PS -1 కేసు, అనంతపురము III టౌన్ PS – 3 కేసులు మరియు రాప్తాడు PS – 2. కేసు, అనంతపురము IV టౌన్ PS – 3 కేసు మొత్తం 19 కేసులు
** *అనంతపురము రూరల్, నాల్గవ పట్టణ మరియు సిసిఎస్ పోలీసులకు ప్రశంస***
అనంతపురము జిల్లాలో మహిళలను టార్గెట్ చేసి వారి మెడలో ధరించిన బంగారు చైన్ లను దొంగలిస్తున్న చైన్ స్నాచర్ల ముఠాలను పట్టుకున్న అనంతపురము రూరల్ సి.ఐ ఎన్.శేఖర్, అనంతపురము IV టౌన్ CI సాయినాథ్, CCS సి.ఐ లు ఇస్మాయిల్, జయపాల్ రెడ్డి, అనంతపురము Special Branch (SB) SI రాజశేఖర్ రెడ్డి, వారి బృందం మరియు, అనంతపురము రూరల్ SI కె.రాంబాబు మరియు సిబ్బంది, తదితరుల బృందాన్ని *జిల్లా ఎస్పీ శ్రీ P.జగదీష్ IPS గారు* అభినందించారు.