ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డి పల్లి గ్రామానికి వచ్చిన విషయం తెలిసిందే. ఈ గ్రామంలో పరిటాల అనుచరుల చేతిలో బలి అయిన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించారు అయితే ఈ పర్యటనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. కొంతమంది పోలీసులు చంద్రబాబుకు కొమ్ముకాస్తున్నారని ఆయన చెప్పిన విధంగానే పనిచేస్తున్నారని అలాంటి వారికి తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని బట్టలూడదీసే రోడ్డుపై నిలబెడతాను అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి పోలీసులకు వార్నింగ్ ఇవ్వడంతో రామగిరి ఎస్ఐ సుధాకర్ జగన్మోహన్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా జగన్ కే వార్నింగ్ ఇచ్చారు. బట్టలూడదీస్తావా… ఉడతీయటానికి ఇదేమైనా అరటి తొక్క.. మేం వేసుకున్న యూనిఫాం నువ్వు ఇచ్చింది కాదు మేము ఎంతో కష్టపడి పరీక్షలు పాస్ అయ్యి, రన్నింగ్ లో సక్సెస్ అయ్యి కష్టపడి సంపాదించిన యూనిఫామ్ ఇది ఎవడో వచ్చి తీస్తానంటే మేమెలా ఒప్పుకుంటాము. మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడు అంటూ జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది.ఎస్సై వ్యాఖ్యలపై వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఘాటుగా స్పందించారు. సుధాకర్ యాదవ్ అవినీతి పరుడని, ఆయన వ్యాఖ్యలకు పోలీసు యూనిఫాం సిగ్గుపడుతోందంటూ వ్యాఖ్యానించారు. ఇదే తరుణంలో ఈయన జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడిన తీరు వైసిపి శ్రేణులకు ఆగ్రహాన్ని తెప్పించాయి.దీంతో వైసీపీ సోషల్ మీడియా రామగిరి ఎస్సైపై విరుచుకుపడుతోంది. ఆయనతో పాటు కుటుంబాన్నీ చంపేస్తామని హెచ్చరికలు, బెదిరింపు కాల్స్ కూడా చేస్తోంది. దీంతో సుధాకర్ యాదవ్ కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. దీంతో తనకు, కుటుంబానికి వస్తున్న బెదిరింపు కాల్స్ పై సుధాకర్ సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారు.