టీమ్ ఇండియా స్టార్ ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ ( Yuzvendra Chahal) మాజీ సతీమణి ధనశ్రీ వర్మ ( Dhanashree Verma)… త్వరలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ( Tollywood Industry ) అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమె సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన కూడా చేశారు. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ( Dil raju ) ప్రొడక్షన్ లో ఈ సినిమా వస్తున్నట్లు చెబుతున్నారు.
ఈ సినిమా కోసం ఇటీవల హైదరాబాద్ ( Hyderabad) వచ్చేసింది ధనశ్రీ వర్మ. ఈ సినిమాకు సంబంధించిన.. షూటింగ్ లో కూడా నిత్యం పాల్గొంటుంది.. ప్రతి విషయాన్ని అప్డేట్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రకటిస్తోంది ధన శ్రీ వర్మ. ఈ నేపథ్యంలోనే తెలుగు డాన్స్ మాస్టర్ యష్ ( Yashwanthkumar jeevakuntala) తో కూడా స్టెప్పులు వేసింది ఈ బ్యూటీ. ఇద్దరు చాలా రొమాంటిక్ గా డాన్స్ చేసి మరి.. రచ్చ చేశారు.
దీనికి సంబంధించిన వీడియోను అలాగే ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ధనశ్రీ వర్మ. తన కొత్త టీం అంటూ పరిచయం కూడా చేసింది. అయితే ఈ వీడియోలు అలాగే ఫోటోలు వైరల్ కావడంతో చాలా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందరూ డాన్స్ ఇలాగా వ్యవహరించి… కాపురం కూల్చుకుందని కామెంట్స్ చేస్తున్నారు. అందుకే చాహల్ కూడా వదిలేసాడని చురకలు అంటిస్తున్నారు. కాగా టీమ్ ఇండియా స్టార్ ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ , మాజీ సతీమణి ధనశ్రీ వర్మ ఇటీవలే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.
చాహల్, ధనశ్రీ 2020 డిసెంబరులో పెళ్లి చేసుకున్నారు. కానీ విభేదాల కారణంగా 2022 జూన్ నుంచి విడివిడిగా ఉంటున్నారు. అలా ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఈ జంట విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం వీరి పటిషన్ ను పరిశీలించిన న్యాయస్థానం తాజాగా వీరికి విడాకులను మంజూరు చేసింది. అలానే కోర్టు ఆదేశాల మేరకు చాహల్.. ధనశ్రీకి రూ.4.75 కోట్ల భరణం అందజేయనున్నట్లు తెలిసింది.
https://www.instagram.com/p/DIlMGF0I38z/?igsh=YzljYTk1ODg3Zg==