అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో మంటలు పుట్టించాయి.మరి, ప్రస్తుత మార్కెట్ల పతనం మాంద్యానికి దారి తీస్తుందని అనుకోవాలా?తాజా పరిణామాలలో గుర్తించాల్సిన అంశం ఏమిటంటే.. స్టాక్ మార్కెట్లలో ఏం జరుగుతుందో, ఆర్థిక వ్యవస్థలోనూ అదే జరుగుతుందని కాదు. స్టాక్ మార్కెట్లు వేరు, ఆర్థిక వ్యవస్థ వేరు. స్టాక్ మార్కెట్లలో షేర్ల ధరలు పడిపోవడం అంటే, ఆర్థికంగా కష్టాలు ఎదురవుతాయని కాదు.అయితే కొన్ని సందర్భాల్లో అలా జరగవచ్చు.
స్టాక్ మార్కెట్లు భారీగా పతనమైనప్పుడు కంపెనీలకు భవిష్యత్ లాభాలకు సంబంధించిన రీఅప్రైజల్ జరిగినట్లు.పన్నులు పెరగడమంటే ఖర్చులు పెరిగి లాభాలు తగ్గుతాయనేది మార్కెట్లు వేసే ప్రాథమిక అంచనా.ఈ పరిస్థితులకు అర్థం మాంద్యం తప్పనిసరని కాదు. అయితే అందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మాత్రమే.ప్రజలు, ప్రభుత్వం చేసే ఖర్చు… ఎగుమతులు వరుసగా రెండు త్రైమాసికాల పాటు తగ్గినప్పుడు.. ఆ తరువాత కూడా తగ్గుతూనే ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో చిక్కుకున్నట్లు భావించవచ్చు.
2024 అక్టోబర్, డిసెంబర్ మధ్య బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ 0.1 శాతం మాత్రమే పెరిగింది. జనవరిలో అంతే శాతం తగ్గినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయిఫిబ్రవరిలో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ పని తీరు ఎలా ఉందో ఈ శుక్రవారం తెలుస్తుంది.మాంద్యంలోకి వెళుతున్నామా లేదా అని చెప్పడానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.ఏదేమైనప్పటికీ, స్టాక్ మార్కెట్‌లలో కొనసాగుతున్న నష్టాలు కొన్ని ఆందోళనకరమైన అంశాలకు ప్రతీకగా చూడాల్సి ఉంటుంది.బ్యాంకుల పని తీరు ఆర్థిక వ్యవస్థకు సూచనగా అంచనా వేస్తారు. “బ్యాంకుల పతనం నాకు ఊపిరి ఆగిపోయేలా చేసింది” అని మార్కెట్ పరిశీలకుడు ఒకరు నాతో చెప్పారు.
తూర్పు పశ్చిమ దేశాలతో అంతర్జాతీయ వాణిజ్యం చేస్తున్న హెచ్ఎస్‌బీసీ, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకుల షేర్లు చివరకు కొంత కోలుకున్నప్పటికీ, రాత్రికి రాత్రే 10శాతం నష్టపోయాయిమరో ఆందోళనకర సంకేతం స్టాక్ మార్కెట్లలో కాకుండా కమోడిటీ ఎక్స్చేంజ్‌లలో కనిపించిందిప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పడానికి రాగి, చమురు ధరలను కొలమానంగా భావిస్తారు.ట్రంప్ సుంకాలు పెంచిన తర్వాత ఈ రెండింటి ధరలు 15శాతానికి పైగా పడిపోయాయి.
వాస్తవానికి ప్రపంచానికి అనేక పెద్ద పెద్ద మాంద్యాలేవీ రాలేదు.1930, 2008లో మహా ఆర్థిక సంక్షోభం, కోవిడ్ మహమ్మారి.. ఈ మూడు సందర్భాల్లో ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో కొంత తిరోగమనం కనిపించింది.ఇప్పుడు అలాంటిది ఏర్పడే పరిస్థితి లేదని అంచనా వేస్తున్నారు. అయితే అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు నమ్ముతున్నారు.
బ్రిటన్‌కు సానుకూల అంశం ఏమంటే, పెట్టుబడిదారులు ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడంతో ప్రభుత్వ రుణ ఖర్చులు ఐదు బిలియన్ పౌండ్ల నుంచి 6 బిలియన్ పౌండ్లు తగ్గే అవకాశం ఉంది.అయితే ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలోకి వెళితే ప్రభుత్వం లోటును భర్తీ చేసుకునేందుకు పన్నులు పెంచాల్సి రావచ్చు.అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ భారతదేశం సహా ప్రపంచంలోని చాలా దేశాలపై దిగుమతి సుంకాలను ఏప్రిల్ 2న పెంచారు.
దీంతో ఆసియా , అమెరికా స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి.సోమవారం జపాన్, హాంకాంగ్, భారత్, సింగపుర్ సహా చాలా దేశాలు స్టాక్ మార్కెట్‌లో భారీ నష్టాలను చూశాయి.అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మార్కెట్ల పతనంపై స్పందిస్తూ “ఏదీ పతనమవకూడదని కోరుకుంటున్నాను, కానీ కొన్నిసార్లు విషయాలను సరిదిద్దడానికి మెడిసిన్స్ తీసుకోవాలి” అన్నారు.
సోమవారం ఆసియాలోని ప్రధాన స్టాక్ మార్కెట్లు ప్రారంభమైన వెంటనే భారీ పతనం నమోదైంది.భారత్‌లో మార్కెట్లు ఏ మేరకు పతనమయ్యాయి.. కొన్ని ఇతర మార్కెట్లు ఎలా కుదేలయ్యాయో చూద్దాం..డోనల్డ్ ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్స్ ప్రకటన ప్రభావం భారత స్టాక్ మార్కెట్‌లో కూడా కనిపించింది.సోమవారం ఉదయం నిఫ్టీ 4 శాతం కంటే ఎక్కువ తగ్గుదలను చూసి, మార్కెట్ ముగిసే సమయానికి 3.24 శాతం నష్టపోయింది.
మరోవైపు సెన్సెక్స్ 2,226 పాయింట్లు నష్టపోయి 73,137.90 పాయింట్ల వద్ద ముగిసింది.ఇక, ఏఎఫ్‌పీ ప్రకారం.. హాంకాంగ్ హాంగ్ సెంగ్‌కు గత 28 ఏళ్లలో ఇదే భారీ పతనం.ఇతర ఆసియా దేశాలలోనూ స్టాక్ మార్కెట్ పరిస్థితి అలాగే ఉంది.జపాన్ నిక్కీ 6.3 శాతం పడిపోయిందిహాంకాంగ్ హాంగ్‌సెంగ్ సూచీ 13.22 శాతం పడిపోయిందిచైనా షాంఘై కాంపోజిట్ 6.6 శాతం పడిపోయిందిఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్200.. 4.5 శాతం పడిపోయిందిదక్షిణ కొరియా కోస్పి 4.4 శాతం పడిపోయిందితైవాన్ టైక్స్ 9.7 శాతం పతనమైంది.సింగపూర్ ఎస్టీఐ 7.1 శాతం పడిపోయిందిఅమెరికా డో జోన్స్ ఫ్యూచర్స్ 2 శాతం పడిపోయాయి
స్టాక్ మార్కెట్ గురించి అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ను అడిగినప్పుడు “మార్కెట్‌లో ఏం జరుగుతుందో మీకు చెప్పలేను. కానీ అమెరికా బలంగా ఉంది” అన్నారు.”ఎలాంటి పతనాన్నీ నేను కోరుకోవడం లేదు, కానీ కొన్నిసార్లు పరిస్థితిని చక్కదిద్దడానికి మెడిసిన్స్ తీసుకోవలసి ఉంటుంది” అని ట్రంప్ అన్నారు.
సుంకాలు విధించిన తర్వాత ఉద్యోగాలు, పెట్టుబడులు అమెరికాకు తిరిగి వస్తున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ప్రపంచం త్వరలో అమెరికాను చెడుగా చూడటం మానేస్తుందని ఆయన తెలిపారు.సుంకాల విధింపును ట్రంప్ సమర్థించుకున్నారు. ఏ ఒప్పందమైనా తాత్కాలికమేనన్నారు.”నేను చాలామంది యూరోపియన్, ఆసియా నాయకులతో మాట్లాడాను. వారు రాజీకి రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు” అని ట్రంప్ అన్నారు.