మయన్మార్, థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.7గా నమోదైంది.
భీకర ప్రకంపనలతో ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. పలు కార్యాలయాల అద్దాలు ధ్వంసం కాగా, భూప్రకంపనలకు పెద్ద పెద్ద బిల్డింగ్‌లు కూడా ఊగిపోయాయి.ఈ భారీ భూకంపం మయన్మార్ మధ్య ప్రాంతాన్ని కుదిపేసింది. బ్యాంకాక్ సహా థాయిలాండ్‌లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు తీవ్రంగా నమోదు అయ్యాయి.చియాంగ్ మాయి వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో టూరిస్టులు భయంతో పరుగులు పెట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.భయంతో రోడ్లపైకి వచ్చిన ప్రజలుభూకంప ప్రభావంతో స్విమ్మింగ్ పూల్ నీళ్లు కదిలిపోవడం, పలు భవనాల అద్దాలు పగిలిపోవడం, ప్రజలు గజగజ వణికిపోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.భయంతో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. అధికారులు రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఈ భూకంపం కారణంగా జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం గురించి పూర్తిస్థాయిలో వివరాలు తెలియరాలేదు.
కానీ ప్రకంపనల తీవ్రత దృష్ట్యా భారీ నష్టం సంభవించే అవకాశముందని అనుమానిస్తున్నారు. అధికారుల ప్రకారం, భూకంప ప్రభావంపై మరింత సమాచారం త్వరలో వెల్లడికానుంది.ఆగ్నేయాసియా దేశాలు మయన్మార్, థాయిలాండ్ నేడు భారీ భూకంపంతో వణికిపోయాయి. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి భారీ భవనాలు సైతం నెలకొరిగాయి. మయన్మార్ లో ప్రాణనష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో కూలిపోయిన ఓ భవనం శిథిలాల్లో 43 మంది చిక్కుకుపోయినట్టు భావిస్తున్నారు.ఈ భూకంపంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. భూకంపంలో చిక్కుకున్న ప్రజలంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. సహాయ కార్యక్రమాల్లో అవసరమైన తోడ్పాటు అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని వెల్లడించారు. సహాయ చర్యలపై భూకంప బాధిత దేశాలను సంప్రదించాలని ప్రధాని మోదీ విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆదేశించారు.కాగా, మయన్మార్ ను రెండు వరుస భూకంపాలు కుదిపేశాయి. 12 నిమిషాల వ్యవధిలో ఈ రెండు భూకంపాలు సంభవించినట్టు రికార్డయింది. మొదట వచ్చిన భూకంపం తీవ్రత 7.7 కాగా… రెండోసారి వచ్చిన భూకంపం తీవ్రత 6.4గా నమోదైంది. థాయిలాండ్ లో 7.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. అటు, బంగ్లాదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లోనూ 7.3 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చినట్టు గుర్తించారు.
Just experienced a 7.7 strength #earthquake in #Bangkok for close to 3 minutes. Its epicenter was Mandalay, Myanmar, over 1200 kms from here.
Despite the distance it swayed buildings; caused cracks, forced evacuations and rooftop pools cascaded much water to down below. Scary! pic.twitter.com/iIeV7WQWN6
— Joseph Çiprut (@mindthrust) March 28, 2025