తెలుగమ్మాయి ఈషా రెబ్బా(Eesha Rebba) లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్(Life Is Beautiful) సినిమాలో చిన్న క్యారెక్టర్ లో కనిపించి మెప్పించింది. అప్పట్నుంచి ఈషా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. హీరోయిన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టు గా కూడా ఈషా పలు సినిమాల్లో నటించింది. అయితే సినిమాల్లో కంటే సోషల్ మీడియా ద్వారానే ఈషా ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్లకు చేరువలో ఉండే ఈషా తాజాగా వైట్ డ్రెస్ ధరించి లూజ్ హెయిర్ తో చాలా సింపుల్ లుక్స్ తోనే నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈషా షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తెలుగు అమ్మాయి, తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న యంగ్ హీరోయిన్ ఈషా రెబ్బా. ఆవిడను డస్కీ బ్యూటీ అని కొందరు అంటారు. రంగుదేముంది? ఆవిడ ముఖంలో కళ బావుంటుందని ఇంకొందరు చెబుతారు. ఈషా రెబ్బా ఎలా ఉన్నా బాగుంటుందనేది ఆవిడ ఫ్యాన్స్ చెప్పే మాట.
వేసవిలో ఎక్కువమంది వైట్ కలర్ డ్రెస్ ప్రిఫర్ చేస్తారు. ఈషా రెబ్బా కూడా లాంగ్ వైట్ ఫ్రాక్ ధరించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.క్యాజువల్ డ్రస్‌లో కూల్‌గా ఈషా రెబ్బా చాలా అందంగా ఉందబ్బా అంటూ నెటిజనులు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఈ ఫోటోలకు లైకుల మీద లైకులు కొడుతున్నారు.
ప్రస్తుతం తరుణ్ భాస్కర్ కథానాయకుడిగా నటిస్తున్న ఒక సినిమాలో ఈషా రెబ్బా హీరోయిన్ రోల్ చేస్తున్నారు. ఆ సినిమాకు అంబటి ఓంకార్ నాయుడు టైటిల్ ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే సినిమాలో హీరో పేరు అదే. మలయాళ హిట్ ‘జయ జయ జయ జయహే’ సినిమాకు అది రీమేక్.