SLBC రెస్క్యూ ఆపరేషన్స్ ని ముమ్మరం చేసిన సర్కార్
రంగం లోకి దిగిన టన్నెల్ ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్ (Meil )మేఘా ఇంజనీరింగ్ సాంకేతిక నిపుణులు
ఎన్.డీ.ఆర్.ఎఫ్ , ఆర్మీ సహాయ చర్యలకి ఊతం
ఎస్.ఎల్.బీ.సి (SLBC) టన్నెల్ కుప్పకూలిపోవడం తో 8 మంది జె.పీ కంపెనీ సిబ్బంది లోపల చిక్కుకున్న వారి కోసం జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్స్ లో తన వంతు సహాయంగా టన్నెల్ ఇంజనీరింగ్ లో పేరు గాంచిన మేఘా ఇంజనీరింగ్ కంపెనీ రంగం లో కి దిగి ఎన్.డీ.ఆర్.ఎఫ్ , ఆర్మీ, ర్యాట్ హోల్ మైనర్స్ తో కలిసి సహాయక చర్యలు చేపడుతుంది
గతం లో ఉత్తర్ ఖండ్ లో సిల్క్ యార టన్నెల్ కూలిపోయి 48 మంది చిక్కుకున్న సమయం లో కూడా మేఘా తన వంతు పాత్ర పోశించింది. అంతే కాకుండ కాశ్మీర్ లో అత్యంత భారీ మంచు తుఫాన్ సమయం లో కూడా భారత్ ఆర్మీ తో కలిసి ఎన్నో రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టింది.
టన్నెల్ ఇంజనీరింగ్ లో మంచి పేరు , అనుభవం ఉన్న మేఘా, దేశ , రాష్ట్ర అత్యవసర సేవల విభాగాల నుండి పిలుపు అందడంతో సత్వరంగా స్పందించి రంగం లో కి దిగింది.
మేఘా ఇంజనీరింగ్ (Megha Engineering) కాశ్మీర్ లో జోజిలా టన్నెల్ , ఉత్తర ఖండ్ లో లో చార్ ధాం టన్నెల్ , ఆంధ్ర ప్రదేశ్ లో వెలిగొండ , కర్ణాటక లో ఎల్.పీ.జి స్టోరేజ్ క్యావరెన్ / టన్నెల్ , మహారాష్ట్ర లో థానే – బోరివాలి టన్నెల్ వంటి భారీ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ లని అత్యంత ప్రభావశీలంగా మరియు ప్రమాద రహితంగా నిర్మిస్తుంది. అంతే కాకుండా మధ్యస్థ , సూక్ష్మ టన్నెల్స్ ని వందల్లో మేఘా దేశ , విదేశాల్లో నిర్మించింది మరియు నిర్మిస్తున్నది .