రేపు జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం..
మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి ప్రత్యేక సమావేశం..
అవిశ్వాసం నెగ్గేలా కూటమి వ్యూహాలు..
సాయంత్రం మలేషియా నుంచి రానున్న కూటమి కార్పొరేటర్లు..
58 మంది కార్పొరేటర్లకు విప్ జారీ చేసిన వైసీపీ
అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వొద్దని విప్ జారీ..
ప్రత్యేక సమావేశానికి హాజరుకాకూడదని వైసీపీ నిర్ణయం..
విప్ జారీ తర్వాత వైసీపీకి రాజీనామా చేసిన..
మాజీమంత్రి అవంతి కూతురు లక్ష్మీప్రియాంక
కౌన్సిల్‌లో YCP చీఫ్ విప్‌గా ఉన్న లక్ష్మీప్రియాంక
ప్రస్తుతం 64కు చేరిన కూటమి సభ్యుల బలం..
30కి చేరిన వైసీపీ కార్పొరేటర్ల సంఖ్య..
గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ పై అవిశ్వాసం కోసం చివరి 24 గంటలు మిగిలి ఉన్నాయి. దీంతో ఈరోజు ( ఏప్రిల్ 18న ) మలేషియా క్యాంప్ నుంచి నగరానికి ఎన్డీయే కూటమి కార్పొరేటర్లు రానున్నారు. ఇక, ఎయిర్ పోర్టు నుంచి నేరుగా భీమిలి శిబిరానికి తెలుగు దేశం పార్టీ తరలించనుంది. ప్రత్యేక కౌన్సిల్ సమావేశం కోసం అధికార యంత్రాంగం విస్తృతమైన ఏర్పాట్లు చేస్తుంది. GVMC పరిసరాల్లో కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. పూర్తి పారదర్శకం కౌన్సిల్ సమావేశం జరిగేలా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు మినహా ఇతరులకు GVMC పరిసరాల్లోకి నో ఎంట్రీ విధించారు. జీవీఎంసీ ఆఫీసు పరిధిలో సుమారు 300 మంది పోలీసులను భద్రత కోసం వినియోగించే అవకాశం ఉంది.
ఇది ఇలాగా ఉండగా..తన సామాజిక వర్గం నేతలే కుట్ర చేస్తున్నారని విశాఖ మేయర్ హరి వెంకటకుమారి(Visakhapatnam Mayor Hari Venkatakumari) కంటతడి పెట్టుకున్నారు. తనపై అవిశ్వాసం పెట్టడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ(Ycp) గుర్తుపై గెలిచి అవిశ్వాసానికి సిద్ధమయ్యారని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదన్నారు. తనను దించాలని కంకణం కట్టుకున్నారని మేయర్ కుమారి వాపోయారు. తమ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి(Ys Jagan Mohan Reddy) యాదవ సామాజిక వర్గంపై మమకారంతో మేయర్‌గా తనకు అవకాశం కల్పించారని చెప్పారు. తమ పార్టీ సిద్ధాంతం ప్రకారం కులమతాలు, పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశానని తెలిపారు. సంఖ్యాబలం లేకుండా తమపై అవిశ్వాసం పెట్టడం, కుట్రలు చేయడం ఎంతవరకూ సమంజసమో కూటమి నేతలు ఆలోచించాలని విశాఖపట్నం మేయర్ హరి వెంకటకుమారి వ్యాఖ్యానించారు.
కాగా విశాఖ కార్పొరేషన్‌పై కన్నేసిన కూటమి.. మేయర్ హరి వెంకట కుమారిపై కలెక్టర్‌కు అవిశ్వాసం నోటీస్ ఇచ్చారు. దీంతో ఈ నెల 19న అవిశ్వాస తీర్మానం కార్యక్రమం జరగనుంది. గత ఎన్నికల్లో 58 మంది వైసీపీ కార్పొరేటర్లు గెలిచారు. ప్రస్తుతం పలువురు టీడీపీ, జనసేనలో చేరిపోయారు. దీంతో వారందరికి విప్ జారీ చేయాలని వైసీపీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు తమ కార్పొరేటర్లను బెదిరిస్తున్నారని చెప్పారు. కేవలం 11 నెలల సమయమే ఉన్న మేయర్ పదవి కోసం కూటమి అరాచకం సృష్టిస్తోందని మండిపడ్డారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, జనసేన ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ మరోసారి పునరాలోచించాలని సూచించారు. సొంత యాదవ కుటానికి చెందిన తన కంట్లో కన్నీరు చూడాలని మరో టీడీపీ ఎమ్మెల్యేతో కలిసి వంశీ కృష్ణ శ్రీనివాస్ ఇన్ని కుట్రలు చేస్తున్నారని మేయర్ హరి వెంటక కుమారి ఆవేదన వ్యక్తం చేశారు.