జగన్ హయాంలో చెలరేగిపోయిన రాజ్యాంగేతర శక్తి, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ హైకోర్టు ఆదేశాలను ధిక్కరించాడు. తల్లి అనారోగ్యాన్ని అడ్డం పెట్టుకుని, తప్పుడు మెడికల్ సర్టిఫికెట్‌తో హైకోర్టుకే టోకరా వేసి మధ్యంతర బెయిలు పొడిగించుకున్న సంగతి తెలిసిందే. బెయిలు గడువు మంగళవారం సాయంత్రం 5 గంటలతో ముగిసిపోయింది. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం అతడు ఆ సమయంలోపు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో లొంగిపోవాల్సి ఉంది. కానీ, మళ్లీ బెయిలు పొడిగించాలంటూ మంగళవారం తన న్యాయవాది ద్వారా హైకోర్టును ఆశ్రయించాడు. అదేం కుదరదని… సాయంత్రంలోపు అతను జైలులో లొంగిపోవాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. అయినా… బోరుగడ్డ తన అజ్ఞాతం వీడలేదు. ‘‘హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం బెయిల్ గడువు ముగిసేలోపు బోరుగడ్డ అనిల్ జైలుకు వచ్చి లొంగిపోలేదు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టుకు, పైఅధికారులకు తెలియచేశాం’’ అని రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసులకు కూడా సమాచారం అందించారు. సాయంత్రం 5 గంటల్లోపు చెన్నై నుంచి విమానంలో వచ్చయినా జైలు సూపరింటెండెంట్ ముందు లొంగిపోవలసిందేనని హైకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. గ్రేస్ పీరియడ్ అరగంట కలుపుకొని సాయంత్రం 5.30 గంటలు దాటినా బోరుగడ్డ జైలుకు రాలేదు.
రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌కు ఏపీ హైకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అవసరమైతే.. చెన్నై నుంచి ఫ్లైట్‌లో రాజమండ్రి వచ్చి సెంట్రల్ జైలులో లొంగిపోవాలని ఆదేశించింది.మరోసారి మధ్యంతర బెయిల్ పొడిగించేది లేదని స్పష్టం చేసింది. ఈ రోజుతో బోరుగడ్డ మధ్యంతర బెయిల్ గడువు ముగిసింది. రాజమండ్రి జైలులో లొంగిపోకుండా మధ్యంతర బెయిల్ పొడిగించాలంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు పైవిధంగా స్పందించింది.