అమరావతి:
ఇంటర్మీడియట్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఇంటర్ పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తయింది. మొత్తం 25 కేంద్రాల్లో నాలుగు విడతల్లో జరిగిన ఈ ప్రక్రియను ఇంటర్ బోర్డు విజయవంతంగా ముగించింది.
📊 కంప్యూటరీకరణ చివరి దశలో
మూల్యాంకనం ముగిసిన వెంటనే మార్కుల కంప్యూటరీకరణ, సాంకేతిక పరిశీలన కొనసాగుతోంది. అధికారుల వధానంతో ఫలితాల ప్రకటనకు ప్రభుత్వ అనుమతి మాత్రమే మిగిలి ఉంది.
📅 ఫలితాల అంచనా విడుదల తేదీ:
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఏప్రిల్ 12, 2025 న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.
👉 గడచిన ఏడాది ఏప్రిల్ 12న ఫలితాలు వచ్చాయి.
AP Inter Results: రేపే ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్.. వెల్లడించిన నారా లోకేష్
ఏపీలోని ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. రేపు అనగా ఏప్రిల్ 12వ తేదీ శనివారం ఇంటర్ ఫలితాలను రిలీజ్ చేస్తున్నట్లు మంత్రి నారాలోకేశ్ తెలిపారు.
ఉదయం 11గంటలకు ఇంటర్ మొదటి, రెండవ సంవత్సర ఫలితాలను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఫలితాలను https://resultsbie.ap.gov.in/వెబ్ సైట్లో చూసుకోవచ్చు.
📲 ఫలితాలను ఇలా చెక్ చేయండి:
WhatsApp ద్వారా (మన మిత్ర సేవ):
📱 నెంబర్: 9552300009
“Hi” అని మెసేజ్ చేయండి
షార్ట్ మెమో (PDF రూపంలో) లింక్ వస్తుంది
అధికారిక వెబ్‌సైట్ ద్వారా:
🌐 https://bie.ap.gov.in
హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలు పొందొచ్చు