టీ20 మజాను మరోసారి అందించేందుకు.. పొట్టి క్రికెట్ మత్తులో ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించేందుకు ఐపీఎల్ కొత్త సీజన్ వచ్చేస్తోంది. ఐపీఎల్ 2025 రేపే (మార్చి 22) స్టార్ట్ అవుతుంది. ఈడెన్ గార్డెన్స్ లో జరిగే తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఈ మ్యాచ్ కంటే ముందు గ్రాండ్ గా ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించబోతున్నారు.
ఐపీఎల్ 2025 ఓపెనింగ్ సెర్మనీని గ్రాండ్ గా నిర్వహించేందుకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేసింది. సింగర్స్ శ్రేయా ఘోషాల్, కరణ్ స్పెషల్ పర్ ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఉర్రూతలూగించనున్నారు. ‘కల్కి 2898 ఏడీ’, ‘యోధ’ వంటి చిత్రాలలో నటించిన బాలీవుడ్ నటి దిశా పటాని కూడా ఈ ఓపెనింగ్ సెర్మనీలో అలరించనుంది. శ్రద్ధాకపూర్, వరుణ్ ధావన్ కూడా ఈ వేడుకలోపాల్గొనే అవకాశముంది. ‘సికందర్’ ప్రమోషన్ కోసం సల్మాన్ ఖాన్ కూడా హాజరుకావచ్చు.
ఈ సీజన్ లో మొత్తం 74 మ్యాచ్ లు జరుగుతాయి. ఫైనల్ మే 25న నిర్వహిస్తారు. 13 స్టేడియాలు మ్యాచ్ లకు ఆతిథ్యమిస్తాయి.
ఐపీఎల్ ప్రారంభోత్సవం మార్చి 22న సాయంత్రం 6 గంటలకు ఆరంభమవుతుంది. ఆ తర్వాత సీజన్ తొలి మ్యాచ్ లో కేకేఆర్, ఆర్సీబీ తలపడతాయి. ఈడెన్ గార్డెన్స్ వేదిక. మ్యాచ్ సాయంత్రం 7.30 కు స్టార్ట్ అవుతుంది. టీవీల్లో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ లో మ్యాచ్ లు చూడొచ్చు. జియోహాట్ స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ వీక్షించొచ్చు.
అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‍కు అంతా సిద్ధమైంది. 10 జట్లు తలపడే హోరాహోరీ టోర్నీకి వేళైంది. నేడు (మార్చి 22) ఐపీఎల్ 18వ సీజన్ షురూ కానుంది. సుమారు రెండు నెలలు మే 25 వరకు ఈ సీజన్ సాగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‍కతా నైట్‍రైడర్స్ (కేకేఆర్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్ల మధ్య ఫస్ట్ మ్యాచ్ జరగనుంది. కోల్‍కతాలోని ఈడెన్స్ గార్డెన్స్ వేదికగా ఈ పోరు సాగనుంది. తొలి టైటిల్ కోసం మొదటి సీజన్ నుంచి నిరీక్షిస్తున్న ఆర్‌సీబీ.. ఈసారి యంగ్ ప్లేయర్ రజత్ పాటిదార్ సారథ్యంలో బరిలోకి దిగుతోంది. ఈసారైనా ట్రోఫీ పట్టాలని విరాట్ కోహ్లీ కసిగా ఉన్నాడు. కాగా, నేటి ఫస్ట్ మ్యాచ్‍కు వాన ముప్పు ఉంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
కోల్‍కతా, బెంగళూరు మధ్య ఈడెన్ గార్డెన్స్ మైదానంలో నేడు జరిగే ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్‍కు వాన ఆటంకాలు కలిగించే అవకాశం ఉంది. శుక్రవారం సాయంత్రం ఇరు జట్ల ప్రాక్టీస్ వాన వల్ల గంట మాత్రమే సాధ్యమైంది. ఆ తర్వాత మైదానాన్ని కవర్లతో కప్పేశారు స్టేడియం సిబ్బంది. నేడు మ్యాచ్ సమయంలోనూ ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశాలు 70 శాతం వరకు ఉన్నట్టు వాతావరణ రిపోర్టులు పేర్కొంటున్నాయి. దీంతో మ్యాచ్‍కు వర్షం వల్ల ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఉరుములు, మెరుపులు, మోస్తరు వర్షాలు పడతాయని కోల్‍కతా పాటు పశ్చిమ బెంగాల్‍లోని కొన్ని జిల్లాలకు శుక్రవారం, శనివారానికి గాను ఆరెంజ్ అలెర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ.
ఐపీఎల్ 2025 ఓపెనింగ్ సెర్మనీ సాయంత్రం 6 గంటలకే మొదలుకానుంది. కొందరు బాలీవుడ్ స్టార్లు, మ్యూజిషియన్స్ పర్ఫార్మ్ చేయనున్నారు. 7 గంటలకు టాస్ పడుతుంది. మ్యాచ్ 7.30 గంటలకు మొదలుకావాల్సి ఉంది. వర్షం పడకుండా అంతా సవ్యంగా సాగాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. మరి వరుణుడు కరుణిస్తాడో.. అడ్డుపడతాడో చూడాలి.
ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ ఒకవేళ వాన వల్ల రద్దైతే కోల్‍కతా, బెంగళూరు జట్లకు చెరో పాయింట్ దక్కుతుంది. గ్రూప్ మ్యాచ్ కావటంతో ఎలాంటి రిజర్వ్ డే ఉండదు. చెరో పాయింట్ వస్తుంది. అయితే, వాన వల్ల రద్దు కాకూడదని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఆటంకాలు ఏర్పడినా మరీ రద్దయ్యే రేంజ్‍లో వాన పడకపోవచ్చు.
కోల్‍కతా ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్‍కు ఎక్కువగా అనుకూలించనుంది. వర్షం పడకపోయి ఫుల్ మ్యాచ్ జరిగితే ఎక్కువ స్కోర్లే నమోదయ్యే అవకాశం ఉంటుంది. పిచ్ ఫ్లాట్‍గా ఉండి బ్యాటర్లకు అనుకూలిస్తుంది. రెండో బ్యాటింగ్ సమయంలో పొగ మంచు ప్రభావం ఉండొచ్చు.
కోల్‍కతా నైట్‍రైడర్స్ ఈ ఐపీఎల్ 2025 సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే సారథ్యంలో ఆడనుంది. గత సీజన్‍లో అద్భుతమైన ఆటతో టైటిల్ పట్టిన కేకేఆర్ జట్టులో ఈ సీజన్‍కు చాలా మార్పులు వచ్చాయి. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. పంజాబ్‍కు వెళ్లాడు. 2025 సీజన్ తొలి మ్యాచ్‍లో రన్నరప్ హైదరాబాద్‍తో కాకుండా ఆర్సీబీతో కోల్‍కతా మ్యాచ్‍ను బీసీసీఐ డిసైడ్ చేసింది. కాగా, ఐపీఎల్ ఫస్ట్ ఎడిషన్ 2008 తర్వాత.. సీజన్ ఫస్ట్ మ్యాచ్‍లో కేకేఆర్, బెంగళూరు మళ్లీ ఇప్పుడు తలపడనున్నాయి.