ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందనున్న జై హనుమాన్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. హనుమాన్ అఖండ విజయం సాధించడంతో, ఈ ఫ్రాంచైజీపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి ఏర్పడింది. ఇప్పుడు ఆ అంచనాలను మించిన స్థాయిలో జై హనుమాన్ సినిమాను రూపొందించేందుకు దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్లాన్ చేస్తున్నాడు. ఇది కేవలం మరో విజువల్ వండర్‌గానే కాకుండా, పౌరాణిక మల్టీ స్టారర్‌గా తెలుగు సినిమాకు ఓ కొత్త పాఠం చెప్పబోతోంది.
ఇప్పటికే టైటిల్‌తోనే ప్రభావం చూపించిన ఈ చిత్రం కోసం ప్రశాంత్ వర్మ ఒక విభిన్నమైన కాన్సెప్ట్‌ను సిద్ధం చేస్తున్నారు. ఇది కేవలం హనుమంతుని కథ కాకుండా, పౌరాణిక సాహిత్యంలో చిరంజీవులుగా పేర్కొనబడే సప్తమహా వ్యక్తుల కథల సమాహారంగా ఉండబోతోందట. హనుమంతుడు, అశ్వత్థామ, విభీషణుడు, బలి చక్రవర్తి, కృపాచార్యులు, పరశురాముడు, వ్యాసుడు.. ఈ ఏడుగురు చిరంజీవుల కథలు ఈ చిత్రంలో ప్రధాన భాగంగా ఉండనున్నాయని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
ఒక్కో పాత్రకు ఒక్కో ప్రముఖ నటుడిని తీసుకునే ఆలోచనపై ప్రశాంత్ వర్మ ప్రస్తుతం దృష్టి పెట్టారని టాక్. అంటే ఇది ఒక రకంగా మల్టీ స్టారర్ పౌరాణిక విజన్ అనే చెప్పొచ్చు. తెలుగు సినిమాల్లో ఇంతవరకూ ఈ స్థాయిలో మల్టీ స్టారర్ పౌరాణిక చిత్రం రాలేదు. ఇది కుదిరితే, జై హనుమాన్ సినిమా తెరపై ఓ మహాభారతంలా కనువిందు చేసే అవకాశం ఉంది. వీరందరి పాత్రలకు తగ్గట్లు స్క్రీన్ ప్లే డెప్టుగా ఉండేలా స్క్రిప్ట్ వర్క్‌ను ప్రశాంత్ ఎంతో జాగ్రత్తగా చేయిస్తున్నాడట.
ఇప్పటికే పరిశ్రమలో పలువురు టాప్ హీరోలతో చర్చలు ప్రారంభించినట్టు సమాచారం. ఒకవైపు విజువల్ ఎఫెక్ట్స్ టీమ్‌తో పాటు హిస్టారికల్ లుక్ డిజైనింగ్ వర్క్ కూడా ముందస్తుగా మొదలయ్యింది. ఎందుకంటే ప్రతీ చిరంజీవి పాత్రకు ఒక ప్రత్యేకమైన నేపథ్యం, గెటప్, ఇంట్రడక్షన్ అవసరం అవుతుంది. డైలాగ్ రైటింగ్, రీసెర్చ్ టీమ్‌లు కంటిన్యూగా ప్రాజెక్ట్‌పై పని చేస్తున్నాయి. ఈ సినిమా నిర్మాణంలో చాలా పెద్ద బడ్జెట్ ఖర్చవుతుందని టాక్. ఈ సినిమా కోసం భారీ నిర్మాణ సంస్థలతో చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ప్రత్యేకంగా బాలీవుడ్, సౌత్ ఇండియా నుంచి ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి పెరిగింది. ప్రశాంత్ వర్మ కూడా ఈ సినిమాను భారత్ మొత్తానికి ప్రసిద్ధిపరచాలన్న ఆలోచనతో తీర్చిదిద్దుతున్నాడట. భక్తి, భావం, విజువల్ గ్రాండ్‌నెస్ అన్నీ కలిసేలా కథను డిజైన్ చేస్తున్నట్లు టాక్.
పూర్తిగా చెప్పాలంటే, జై హనుమాన్ కేవలం ఒక సినిమానే కాదు… ఇది ఒక మహా పౌరాణిక ప్రయాణం అవుతుంది. సప్త చిరంజీవుల చరిత్రను ఆధునిక చిత్రీకరణతో, ప్రేక్షకుల ఆధ్యాత్మిక భావోద్వేగాలకు దగ్గరగా తీసుకురావాలని దర్శకుడు లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ఊహించిన విధంగా కొనసాగితే, ఇండియన్ స్క్రీన్‌పై ఇదొక అద్భుతమైన మల్టీ స్టారర్ మైథలాజికల్ మాస్టర్‌పీస్‌గా నిలవడం ఖాయం