ఇళయదళపతి విజయ్ రాజకీయ రంగ ప్రవేశానికి ముందు నటిస్తున్న ఆఖరి సినిమా ‘జననాయకన్’. హెచ్ వినోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రారంభ దశ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలక డీల్ వార్తల్లోకి వచ్చింది. శాటిలైట్, ఓటీటీ హక్కుల కోసం భారీ మొత్తం చెల్లించి ఓ ప్రముఖ సంస్థ ముందుకొచ్చిందని సమాచారం. ఇది విజయ్ కెరీర్‌లోనే , తమిళ సినీ ఇండస్ట్రీలోనే ఓ రికార్డ్ లాంటి డీల్‌గా భావిస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టైటిల్ పోస్టర్‌పై కూడా మంచి స్పందన వస్తోంది. పొలిటికల్ టచ్ ఉన్న మాస్ డ్రామాగా ఈ చిత్రాన్ని డిజైన్ చేస్తున్నారన్న టాక్ ఉంది. అంతేకాదు, ఇది బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’కి రీమేక్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దర్శకుడు హెచ్ వినోత్ పర్సనల్ టచ్‌తో, కొన్ని కీలక మార్పులతో కథను కొత్తగా మలుస్తున్నట్టు సమాచారం. విజయ్ పాత్రకు సరిపోయేలా స్క్రీన్ ప్లేను డిజైన్ చేస్తున్నారట. విజయ్‌కు తమిళనాట ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో తెలిసిందే. పొలిటికల్ ఎంట్రీ నేపథ్యంలో విజయ్ చేసిన ఈ చివరి సినిమా అనే హైప్‌తో, ఈ చిత్రానికి ఇప్పటికే భారీ డిమాండ్ ఏర్పడింది. ఇక ఇటీవల ‘జననాయకన్’ సినిమా శాటిలైట్, ఓటీటీ రైట్స్ కలిపి దాదాపు రూ.170 నుండి రూ.173 కోట్ల మధ్య డీల్ క్లోజ్ అయినట్టు సమాచారం. అది కూడా కేవలం తమిళ భాషకు సంబంధించిన డీల్ అని టాక్. ఈ డీల్‌లో డిజిటల్, శాటిలైట్, ఆడియో, డబ్బింగ్ రైట్స్ అన్నీ కలిపి ఉన్నట్లు టాక్.
ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆమె విజయ్‌తో నటించడం కూడా సినిమాకు మరో హైప్‌ను తీసుకొచ్చింది. నిర్మాతలు ఈ సినిమాను 2026 జనవరి లేదా రిపబ్లిక్ డే సమయంలో విడుదల చేయాలని భావిస్తున్నారు. అది జరిగితే తమిళంలోనే కాదు, ఇతర భాషలలోనూ విజయ్ క్రేజ్ ఎలా ఉందో మరోసారి రుజువు కానుంది. కాగా, ఈ సినిమా తమిళంతో పాటు పాన్ ఇండియా రిలీజ్ కావచ్చన్న ప్రచారం కూడా ఊపందుకుంటోంది. విజయ్‌ను రాజకీయ రంగ ప్రవేశానికి మించిన హైప్‌లో నిలబెట్టేందుకు ఈ సినిమా ఎంతో కీలకమవుతుంది. అదే కారణంగా నిర్మాతలు ప్రమోషన్స్, టెక్నికల్ హంగులు, మ్యూజిక్, విజువల్స్ పరంగా ఏమాత్రం రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో సినిమాను రూపొందిస్తున్నారు. కేవలం ఓటీటీ, శాటిలైట్ రైట్స్‌లోనే రూ.170 కోట్లకు పైగా రాబట్టిన ఈ సినిమా, థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.