పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం మార్చి 14న జరగనున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ వేడుక ప్రత్యేకంగా జరగబోతున్నది, ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరగనున్న తొలి ఆవిర్భావ దినోత్సవం కావడంతో ఈ వేడుకను ఎంతో ప్రత్యేకంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇక ఈ కార్యక్రమం పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో నిర్వహించబోతున్నారు. ఇక ఈ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించి ఉన్న నేపథ్యంలో ఈ వేడుక ఏర్పాట్ల బాధ్యతను ప్రముఖ నిర్మాత బన్ని వాసుకు పవన్ కళ్యాణ్ అప్పగించినట్లు తెలుస్తోంది.ఆవిర్భావ దినోత్సవ సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు, ఏర్పాట్ల నిర్వహణ బాధ్యతలను ఆయన కట్టబెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. బన్నీ వాసును పబ్లిసిటీ అండ్ డెకరేషన్ ఇన్‌ఛార్జ్‌గా నియమించినట్లు సామాజిక మాధ్యమాలలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
బన్నీ వాసు గతంలో కూడా చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో కూడా ఈయన పబ్లిసిటీ అండ్ డెకరేషన్ ఇన్చార్జిగా పనిచేశారు దీంతో ఆయనకు మంచి అనుభవం ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఈ బాధ్యతలను బన్నీ వాసుకి ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక బన్నీ వాసు ఈ బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తారని తెలిసే జనసైనికులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక బన్నీ వాసు ఎప్పటినుంచో జనసేనకు పూర్తిస్థాయిలో మద్దతు తెలియజేస్తున్నారు నిజానికి ఈయన గత ఎన్నికలలో జనసేన నుంచి పోటీ చేయాల్సి ఉండేది కానీ తాను సినిమాలలో బిజీగా ఉన్నానని సినిమాలు రాజకీయాలకు తాను ఒకే కాలంలో న్యాయం చేయలేనని అందుకే తాను రాజకీయాలలోకి రాలేరని రాబోయే రోజులలో ఆర్థికంగా తాను మరింత స్థిరపడిన తరువాతనే రాజకీయాలలోకి వస్తానని క్లారిటీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.
ఆవిర్భావ దినోత్సవ సభకు సంబంధించిన ఏర్పాట్లను ఆయనకు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. బన్నీ వాసును పబ్లిసిటీ అండ్ డెకరేషన్ ఇన్‌ఛార్జ్‌గా నియమించినట్లు వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
సభకు సంబంధించిన నిర్వహణ మొత్తం బన్నీ వాసు నేతృత్వంలో జరగనున్నట్లు తెలుస్తోంది. బన్నీ వాసు గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ పబ్లిసిటీ కోఆర్డినేషన్ బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.
సినిమా నిర్మాణంలో బన్నీ వాసు నైపుణ్యాన్ని, సంస్థాగత నైపుణ్యాన్ని జనసేన ఆవిర్భావదినోత్సవ వేడుక విజయవంతానికి ఉపయోగించనున్నారని జన సైనికులు భావిస్తున్నారు. ఈ కీలక నియామకంతో జన సైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.