జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో జయకేతనం పేరుతో సభను ఏర్పాటుచేశారు. ఈ సభకు భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఈ సభలో పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. “2018లో పోరాట యాత్ర చేశాం, ఓటమి భయం లేదు కాబట్టే 2019లో పోటీ చేశాం, ఓడిపోయినా అడుగు ముందుకు వేశాం, మనం నిలబడ్డాం.. పార్టీని నిలబెట్టాం, మనన నిలబడ్డాం.. 4 దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టాం” అని అన్నారు. అలాగే గతంలో గొంతెత్తితే కేసులు పెట్టారు, నిర్బంధంలో ఉంచారు. నన్ను తిట్టని తిట్టు లేదు, చేయని కుట్ర లేదని అన్నారు.
అసెంబ్లీ గేట్‌ను కూడా తాకలేవని చెప్పారు, వందశాతం స్ట్రయిక్ రేట్‌తో ఘనవిజయం సాధించాం, ఇవాళ జయకేతనం ఎగరవేస్తున్నాం అని పవన్ పేర్కొన్నారు. అలాగే పార్టీ ఆవిర్భం గురించి మాట్లాడుతూ.. “జనసేన జన్మస్థలం తెలంగాణ.. కర్మస్థలం ఆంధ్రా, తెలంగాణ భూమి నాకు పునర్జన్మ ఇచ్చింది” అని అన్నారు. ఆయన మాట్లాడుతూ.. “ఆడపడుచుల పోరాటస్ఫూర్తిని మరచిపోలేను, ప్రజల దృష్టిలో అందరి దృష్టిలో రాణి రుద్రమ్మలు, వీరనారి గుణ్ణమ్మలు జనసేన ఆడపడుచులు, అందరి క్షేమం కాంక్షించే సూర్య దేవుని లేలేత కిరణాలు, తేడావస్తే కాల్చి ఖతం చేసే లేజర్ టీమ్‌లు జనసేన వీర మహిళలు” అని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. పార్టీ ఆవిర్భావ సభలో చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో చురుగ్గా కార్యకలాపాలు సాగిస్తున్న జనసేన పార్టీ.. తెలంగాణలో అంత యాక్టివ్‌గా కనిపించడం లేదు. అయితే కాకినాడ జిల్లా పిఠాపురంలో జయకేతనం పేరుతో నిర్వహించిన 12వ ఆవిర్భావ సభలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్.. తన స్పీచ్ మొదట్లోనే తెలంగాణ గురించి ఎక్కువగా మాట్లాడటం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హైలైట్‌గా మారాయి.
జనసేన పార్టీ జన్మస్థలం తెలంగాణ అని.. కానీ కార్యస్థానం మాత్రం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తన స్పీచ్‌ను కొనసాగించారు. గతంలో తాను కరెంట్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో కొండగట్టు ఆంజనేయస్వామి దయతో ప్రాణాలతో బయటపడినట్లు వెల్లడించారు. అంతేకాకుండా గద్దర్ గురించి తనకు ఉన్న అభిమానాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా దాశరథి కృష్ణమాచార్యుల గురించి గుర్తు చేసిన పవన్ కళ్యాణ్ దాశరథి సాహిత్యం చదివి తాను ప్రభావితం అయినట్లు తెలిపారు. రుద్రవీణ వాయిస్తా.. అగ్నిధారలు కురిపిస్తాం.. అనే మాటలు నిజం చేశామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
ఇక దేశంలో ప్రస్తుతం జరుగుతున్న భాషా వివాదంపైనా పవన్ కళ్యాణ్ పరోక్షంగా స్పందించారు. బహు భాషలే భారతదేశానికి మంచిదని పేర్కొన్న జనసేనాని.. తమిళనాడు సహా అన్ని రాష్ట్రాలకు ఒకే సిద్ధాంతం ఉండాలని తెలిపారు.
అయితే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలోనూ చర్చకు దారి తీస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమిలో ఉన్న జనసేన పార్టీని తెలంగాణలో కూడా క్రియాశీలకంగా మార్చేందుకు సిద్ధం అవుతున్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి. తెలంగాణలో కూడా జనసేన పార్టీని విస్తరించే దిశగా జనసేనాని దృష్టి పెట్టనున్నట్లు ఈ వ్యాఖ్యల ద్వారా అర్థం అవుతోంది. అన్నీ కుదిరితే.. తెలంగాణ జనసేన పార్టీ వర్గాల ద్వారా వచ్చే సూచనలతో మరికొన్ని రోజుల్లో జరగనున్న తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
భయం లేదు భయం లేదు భయమన్నది లేనే లేదు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రసంగించారు. పిఠాపురం చిత్రాడలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం చేశారు. ఇల్లు దూరమైనా.. చేతిలో దీపం లేకపోయినా.. అన్ని ఒక్కడ్నే అయి ముందుకు నడిచినట్లు తెలిపారు.
నా తెలంగాణ కోటి రతనాల వీణ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కరెంట్ షాక్ తగిలి చనిపోబోయిన తాను.. కొండగట్టు అంజన్న దీవేలతో.. తెలంగాణ ప్రజల దీవెనలతో ప్రాణాలతో బయటపడినట్లు తెలిపారు. గద్దర్ పాటను గుర్తు చేసుకున్నారు. నా అన్న గదరన్నకు వందనం అని తెలిపారు. తెలంగాణ నుంచి వచ్చిన జనసైనికులకు అభినందనలు తెలిపారు. జనసేనకు తెలంగాణ జన్మభూమి.. ఆంధ్రప్రదేశ్ కర్మభూమి అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
గద్దరన్న ఖుషీ సినిమా చూసిన తర్వాత తన అన్నయ్యను కలిసి అనంతరం తనను కలిశారని పవన్ చెప్పారు. యే మేరా జహా పాటను ప్రశంసించారన్నారు. భారతమాతను సంకెళ్లను బంధించావు కాదా నీ భావం అర్థమైందినీవు ప్రజా సేవకు వెళ్లాలని గద్దర్ చెప్పారు అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
హిందీలో మాట్లాడుతూ.. హోలీ శుభాకాంక్షలు తెలిపారు. తనను ఆదరించిన తమిళనాడు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. భారతదేశానికి బహుభాషే మంచిదని పవన్ అన్నారు. తమిళనాడు సహా అన్ని రాష్ట్రాలకు ఒకే విధానం ఉండాలని ఆయన స్పష్టం చేశారు. దేశ ఐక్యత కోసం బహుభాష అవసరమన్నారు. త్రిభాష విధానంపై చర్చ జరుగుతున్నవేళ పవన్ కళ్యాన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రసంగిస్తున్న సమయంలో ఓజీ ఓజీ అని అరుస్తున్న కార్యకర్తలను వారించారు పవన్ కళ్యాణ్. నా మాట వినడం వల్లే 151 సీట్లున్న పార్టీ పోయిందన్నారు. ఇప్పుడు కూడా తన మాట వినండి అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఐ లవ్యూ అంటూ కార్యకర్తలనుద్దేశించి అన్నారు పవన్.
పోలీసు శాఖ అంటే తనకు ఎంతో గౌరవమని పవన్ కళ్యాణ్ చెప్పారు. సభకు సహకరించిన పోలీసులకు, డీజీపీ, కాకినాడ ఎస్పీకి, అధికారులకు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. తాను పోలీసు కానిస్టేబుల్ కొడుకుని ఉన్నతాధికారి కావాలనుకున్నారు కానీ.. తాను డిగ్రీ ఫెయిల్ అయ్యాయని చెప్పారు.
దశాబ్దంపాటు పార్టీని మోయాలంటే ఎన్ని అవమానాలు భరించి ఎన్ని పోగొట్టుకోవాలి. వ్యక్తిగత జీవితాన్ని కోల్పోవాలి. ఆరోగ్యం కోల్పోవాలి. మార్షల్ ఆర్ట్స్ చేస్తున్నప్పుడు గ్రానైట్ రాళ్లను గుండెలపై పగులగొట్టిచ్చికున్నట్లు తెలిపారు. ఇప్పుడు తాను తన రెండోవ ఏడేళ్ల కొడుకును కూడా ఎత్తుకలోకేపోతున్నట్లు తెలిపారు. మీ అండతో మళ్లీ ఆ బలాన్ని సాధిస్తున్నామన్నారు.
రిజిస్టర్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పార్టీగా జనసేన మారిందని పవన్ కళ్యాణ్ అన్నారు. 100 శాతం స్ట్రైక్ రేట్‌తో విజయం సాధించామన్నారు. గతంలో ఎంజే అక్బర్ అనే జర్నలిస్టు బీజేపీని విమర్శించారు.. ఆ తర్వాత 2014లో బీజేపీ నుంచే ఎంపీ అయ్యారు. తాను లెఫ్ట్ రైట్ మారితే తప్పా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
అల్లరి చిల్లర వాళ్లు తనకు అవసరం లేదు.. మిలిటరీలా నిలబడేవారంటేనే ఇష్టమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ బలమైన దేశం కావాలని, 5 ట్రిలియన్ ఎకనామీ కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. అందుకే దేశం కోసం నిలబడే యువత కావాలి. చంద్రబాబు వికసిత్ ఏపీ కోసం ఆలోచిస్తున్నారు. నేను భవిష్యత్ యువత కోసం ఆలోచిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ చెప్పారు.