మహిళలకు పీరియడ్స్ టైమ్ లో ఎంత ఇబ్బందిగా ఉంటుందో చెప్పడం కూడా కష్టం. ఆ టైమ్ లో వచ్చే నొప్పులు, శారీరకంగా వచ్చే మార్పులతో పాటూ మూడ్ స్వింగ్స్ కూడా ఉంటాయి. కొంతమంది మగాళ్లు ఆ నొప్పిని కనీసం అర్థం చేసుకోకుండా మాట్లాడుతుంటారు. అలా మాట్లాడే వారిపై బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ అసహనం వ్యక్తం చేసింది.పీరియడ్స్ టైమ్ లో వచ్చే నొప్పిని చులకనగా చూస్తే అది మరింత బాధను కలిగిస్తుందని, తనక్కూడా అందరిలానే మూడ్ స్వింగ్స్ ఉంటాయని తెలిపింది జాన్వీ. ఆ మూడ్ స్వింగ్స్ వల్ల తన మాట తీరులో కూడా తేడా వస్తుందని, తన ప్రవర్తనను బట్టి తాను పీరియడ్స్ లో ఉన్న విషయం అందరికీ అర్థమవుతుందని చెప్పింది జాన్వీ కపూర్.
తాను చిరాకుగా మాట్లాడిన ప్రతీసారీ నీకు ఇది ఆ టైమా అని అడుగుతుంటారని, ఆ అడిగే విధానమే కొన్ని సార్లు బాధిస్తోందని జాన్వీ పేర్కొంది. కొంతమంది ఈ పీరియడ్స్ పెయిన్ ను సరిగా అర్థం చేసుకోకుండా ఇది చాలా నార్మల్ విషయమని సెటైరికల్ గా మాట్లాడతారని, అర్థం చేసుకున్న వాళ్లు మాత్రమే మనల్ని ప్రశాంతంగా ఉంచుతూ, రెస్ట్ తీసుకోమని సలహాలిస్తుంటారని జాన్వీ తెలిపింది. నెలసరి సమయంలో వచ్చే ఆ నొప్పి అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుందని, ఆ టైమ్ లో ఆడవాళ్లు పడే బాధను, మెంటల్ స్టేటస్ ను అబ్బాయిలు నిమిషం కూడా భరించలేని, ఒక వేళ అబ్బాయిలకు పీరియడ్స్ వస్తే ఆ నొప్పికి అణు యుద్ధాలే జరిగేవేమో అని జాన్వీ కపూర్ చెప్పింది. జాన్వీ ఈ విషయం గురించి మాట్లాడటాన్ని అందరూ అభినందిస్తూ ప్రశంసిస్తున్నారు.
ఇక కెరీర్ విషయానికొస్తే బాలీవుడ్ లో పలు సినిమాలు చేసినప్పటికీ సరైన సక్సెస్ అందుకోలేకపోయిన జాన్వీ కపూర్, గతేడాది ఎన్టీఆర్ తో కలిసి టాలీవుడ్ లో చేసిన దేవర మంచి సక్సెస్ అయిన విషయం తెలిసిందే. టాలీవుడ్ లో జాన్వీ చేసిన మొదటి సినిమానే మంచి హిట్ అయింది. దీంతో రెండో సినిమాగా రామ్ చరణ్ సరసన నటించే అవకాశమొచ్చింది. ప్రస్తుతం జాన్వీ చరణ్ తో కలిసి పెద్ది సినిమాలో నటిస్తోంది. నెక్ట్స్ ఇయర్ మార్చిలో ఈ సినిమా రిలీజ్ కానుంది.