సినీ ఇండస్ట్రీలో ఎవరికెప్పుడు ఫేమ్ వచ్చి లైమ్ లైట్ లోకి వస్తారో తెలియదు. హీరోయిన్ల విషయంలో అయితే ఇదీ మరీ ఎక్కువ. ఎప్పుడు ఎలా ఫేమ్ లోకి వచ్చి వార్తల్లో నిలుస్తారో ఎవరూ ఊహించలేరు. కొంతమందికి రెడ్ కార్పెట్ ల ద్వారా ఫేమ్ వస్తే, మరికొందరికి మరోలా వస్తుంది. అయితే ఇప్పుడు బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ఎప్పటికంటే ఎక్కువగా ఫేమస్ అవుతోంది.బాలీవుడ్లో వరుస ఫ్లాపుల తర్వాత ఇప్పుడు సడెన్ గా జాన్వీ పేరు ప్రపంచ వేదికపై వినిపిస్తోంది. ఆ వేదిక మరేదో కాదు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్. ఇషాన్ ఖట్టర్ తో కలిసి జాన్వీ కపూర్ నటించిన హోమ్ బౌండ్ అనే సినిమా 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అన్ సెర్టైన్ రిగార్డ్ విభాగంలో ప్రదర్శనకు సెలెక్ట్ అయింది. ఈ సినిమాకు హైదరాబాద్ కు చెందిన నీరజ్ గైవాన్ దర్శకత్వం వహించారు.
ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎంతో ఇష్టపడే ప్రతిష్టాత్మక కళాత్మక చిత్రాల లీగ్ లో హోమ్ బౌండ్ చేరింది. నీరజ్ తీసిన మొదటి సినిమా మసాన్ కూడా ఇదే బాటలో నిలవగా, ఇప్పుడు హౌమ్ బౌండ్ కూడా అదే బాటలో వెళ్తూ ఆ లెగసీని కంటిన్యూ చేస్తోంది. మే 13 నుంచి మే 24 మధ్య హోమ్ బౌండ్ సినిమా ప్రపంచంలోని బెస్ట్ సినిమాలతో పాటూ కేన్స్ లో ప్రదర్శించబడనుంది. ఈ సందర్భంగా జాన్వీ తన ఇన్‌స్టాలో మాట్లాడుతూ తన మొత్తం జర్నీలో ఇది ప్రౌడ్ మూమెంట్ అని, నటిగా మాత్రమే కాకుండా, ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫామ్ పై ఇండియన్ సినిమాకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిగా తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. ఇండియాలో పాతుకుపోయిన కథలు, వాటి భావోద్వేగాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని నిర్మాత కరణ్ జోహార్ ఈ సందర్భంగా అన్నారు.
ఇవాళ కేన్స్ తో వార్తల్లో నిలిచిన జాన్వీ కపూర్, రేపు మరో కొత్త అంశంలో వార్తల్లోకెక్కొచ్చు. హోమ్ బౌడ్ సినిమాతో ప్రపంచ దృష్టిని ఎట్రాక్ట్ చేసిన జాన్వీ ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే