దక్షిణాది రాష్ట్రాలను తీవ్ర ఆందోళనలోకి నెడుతోన్న అంశం- డీలిమిటేషన్. 2026 నాటికి జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాలను పునర్విభజించాలంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఆశించిన స్థాయిలో సీట్ల సంఖ్య పెరగవని ఇక్కడి ప్రభుత్వాలు భావిస్తోన్నాయి.
ఈ పరిస్థితుల మధ్య- కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న డీలిమిటేషన్ ప్రక్రియకు వ్యతిరేకంగా సరికొత్త ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు స్టాలిన్. దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకుని రావడానికి కృషి చేస్తోన్నారు. ఇందులో భాగంగా దక్షిణాదిన బీజేపీ- మిత్రపక్షాలేతర ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల అధినాయకులతో నేడు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఫెయిర్ డీలిమిటేషన్ (Fair delimitation) అనేది ఈ భేటీ ప్రధాన డిమాండ్.
జాతీయ స్థాయిలో ప్రతిపక్షంగా ఉంటోన్నందున కాంగ్రెస్ దీనికి మద్దతు ఇస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ భేటీకి హాజరు అయ్యారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ- ఎన్డీఏ కూటమితో వ్యతిరేకం కావడం వల్ల అటు భారత్ రాష్ట్ర సమితి ప్రాతినిథ్యం కూడా ఈ సమావేశంలో కనిపించింది. మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇందులో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డితో కలిసి వేదికను పంచుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రం వరకు రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ- డీలిమిటేషన్ అనేది జాతీయ స్థాయి అంశం కావడం, బీజేపీ విధానాలను ఈ రెండు పార్టీలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న నేపథ్యంలో వారిద్దరూ ఈ భేటీకి హాజరయ్యారు. కేరళ, పంజాబ్ ముఖ్యమంత్రులు – పినరయి విజయన్, భగవంత్ మాన్, బిజు జనతాదళ్ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత డీకే శివకుమార్.. కొద్దిసేపటి కిందటే చెన్నైకి చేరుకున్నారు కూబా. డీఎంకే సమావేశానికి హాజరు కానున్నారు. చెన్నై విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది.
ఈ భేటీకి తాను హాజరు కావట్లేదని, పార్టీ తరఫున డీకే హాజరవుతారంటూ ఇదివరకే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ఈ మేరకు స్టాలిన్‌కు లేఖ రాశారు. పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్‌కు కూడా ఆహ్వానం అందినప్పటికీ- ఆ పార్టీ ప్రాతినిథ్యం ఉండట్లేదు. ఇందులో పాల్గొనదలచుకోలేదు. దక్షిణాదిన తెలుగుదేశం, జనసేన మినహా అన్ని పార్టీలు కూడా డీలిమిటేషన్ ప్రక్రియకు వ్యతిరేకంగా గళమెత్తుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తటస్థ వైఖరిని ఇక్కడ కూడా కొనసాగిస్తోంది. ఫలితంగా- ఈ సమావేశానికి ఏపీ నుంచి ప్రధాన పార్టీల ప్రాతినిథ్యం దాదాపుగా లేనట్టే..
పూర్తయితే ఉత్తరాది ఆధిపత్యం మరింత పెరగడం ఖాయం అనే భయం మన నాయకులు అనవసరంగా పుట్టిస్తున్నారు. ఇప్పటికే దక్షిణాదిలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో లేని సీట్లు.. అతి చిన్నదైన తమిళనాడులో ఉంది. మరోవైపు తెలంగాణ కంటే చిన్నదైన కేరళలో 20 లోక్ సభ సీట్లు.. ఉంటే.. తెలంగాణ లో 17 లోక్ సభ సీట్లు ఉన్నాయనే విషయాన్ని కొంత మంది ప్రస్తావిస్తున్నారు. ఇక దేశంలో విస్తీర్ణంలో పెద్దదైన రాజస్థాన్ 25 సీట్లు ఉంటే.., గుజరాత్ లో 26 సీట్లే ఉన్నాయి. అటు దక్షిణాదిలో కర్ణాటకలో చిన్నరాష్ట్రమైన 28 సీట్లు ఉన్నాయి. ఉత్తరాది రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్ లో 4,6 లోక్ సభ సీట్లే ఉన్నాయని ప్రస్తావిస్తున్నారు. కేవలం నార్త్ లో ఉత్తర ప్రదేశ్ లో 22 కోట్లకు 80 సీట్లు ఉంటే.. దక్షిణాదిలో మొత్తం జనభా ప్రకారం చూసుకుంటే 20 కోట్ల వరకే ఉన్నా.. దాదాపు 145 కు పైగా లోక్ సభ సీట్లు ఉన్నాయనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అటు బిహార్ లో 40, పశ్చిమ బెంగాల్ లో 42 సీట్లున్నాయి. మొత్తంగా చూసుకుంటే.. ఈ నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాదికి ఎలాంటి అన్యాయం జరగదని న్యాయ, రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు.
మరోవైపు జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదన కాకరేపుతోంది. దీన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చెన్నైలో అఖిలపక్ష సమావేశం తలపెట్టారు. ఈ భేటీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ పాల్గొంటున్నారు. ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మహేశ్ గౌడ్ హాజరవుతున్నారు. స్టాలిన్ ఆహ్వానం మేరకు బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సైతం ఈ సమావేశంలో పాల్గొంటుండటం ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో బద్ధశత్రువుల్లా వ్యవహరిస్తున్న అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు. ఈ అంశంపై కలిసి పోరాడేందుకు సిద్ధమయ్యాయి.
జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అన్నది సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టేనంటూ ప్రకటించిన స్టాలిన్.. ఆ ప్రతిపాదనకు వ్యతిరేకంగా పోరాడేందుకు జేఏసీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. చెన్నైలో జరిగే అఖిలపక్ష సమావేశంలో జేఏసీ ప్రతిపాదనను తెరపైకి తేనున్నారు. అఖిలపక్ష భేటీ ముగిసిన తర్వాత కేటీఆర్ మాజీ గవర్నర్ నరసింహన్ ఇంటికి వెళ్లనున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి. మరోవైపు స్టాలిన్ తనపై వచ్చిన అవినీతి ఆరోపణలు కప్పిపుచ్చుకునేందుకే ఈ డీలిమిటేషన్ అస్త్రాన్ని అందుకున్నట్టు బీజేపీ శ్రేణులు ప్రస్తావిస్తున్నాయి.