“కెతిక కూడా తన మీద వస్తున్న ఈ అటెన్షన్ ని మరింత పెంచుకునేందుకు ఆమె కూడా సోషల్ మీడియాలో ఈ సాంగ్ నే ప్రమోట్ చేస్తుంది. సాంగ్ లో కెతిక గ్లామర్ ట్రీట్ కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుందని అంటున్నారు. కెతిక శర్మ నిజంగానే ఈ సాన్ తో ఒక ఊపు ఊపేసేలా ఉంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ సాంగ్ కి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. యూట్యూబ్ లో రిలీజైన సాంగ్ కే మంచి రెస్పాన్స్ రాగా ఇక థియేటర్ లో ఈ సాంగ్ ఆడియన్స్ ని ఊగిపోయేలా చేస్తుందని అంటున్నారు.”
ఈమధ్య కాలంలో ఐటం సాంగ్స్ హవా పెరిగిపోయింది. పుష్ప లాంటి భారీ బడ్జెట్ సినిమాల్లో ఇవి బాగా వర్కౌట్ అవుతున్నాయి. దాంతో మేకర్స్ స్పెషల్ సాంగ్స్ పై ఎక్కువ దృష్టి పెట్టారు. అయితే ఇవే పాటలు వివాదాలకు కూడా కారణం అవుతున్నాయి. కొన్ని ఐటెం డ్యాన్స్ స్టెప్పులు ట్రోలర్స్ చేతికి చిక్కుతుండగా.. మరికొన్ని వివాదాలకు కారణమవుతున్నాయి. ‘పుష్ప’ సినిమాలో సమంత-అల్లు అర్జున్ డ్యాన్స్, ‘పుష్ప 2’లో శ్రీలీల స్టెప్పులు, షెహనాజ్ గిల్ పాడిన ‘సజన వే సజన’ పాట కూడా దేశ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు, కేతికా శర్మ చేసిన ఓ ఐటం సాంగ్ వివాదానికి దారి తీసింది
నితిన్, వెంకీ కుడుముల ఇదివరకు భీష్మతో హిట్ అందుకున్నారు. ఇప్పుడు మళ్లీ రాబిన్ హుడ్ తో ఆ హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నారు. సినిమా పై ఇప్పటికే పాజిటివ్ బజ్ ఏర్పడగా ట్రైలర్ రిలీజ్ అయితే కానీ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందన్నది తెలుస్తుంది. ఐతే సినిమా గురించి మేకర్స్ మాత్రం తప్పకుండా ఆడియన్స్ ని అలరిస్తుందని గట్టి నమ్మకంతో చెబుతున్నారు. నితిన్ కూడా కొన్నాళ్లుగా సక్సెస్ కోసం ట్రై చేస్తున్నాడు. రాబిన్ హుడ్ అతను కోరుకుంటున్న హిట్ అందిస్తుందో లేదో చూడాలి.
సినిమాలో హీరోయిన్ కేతిక శర్మ ఐటం సాంగ్ చాలా స్పెషల్ కాబోతోంది. ఈ సాంగ్ పేరు కూడా “అది ద స్పెషల్”. ఇందులో బోల్డ్ నెస్ డోస్ కాస్త ఎక్కువైనట్టు కనిపిస్తోంది. శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసినఈ పాటకు ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ సాహిత్యం రాశారు. ఈ ఐటెం సాంగ్ తో నితిన్, శ్రీలీల కూడా కనిపించారు. జివి ప్రకాష్ స్వరపరిచిన ఈ పాట ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఈసాంగ్ లో బోల్డ్ నెస్ ఎక్కువ అవ్వడం వల్ల ట్రోలింగ్ కు గురవుతోంది. .
మరీ ముఖ్యంగా కేతిక శర్మ వేసుకున్న మల్లె పువ్వుల జాకెట్. దానికి తగ్గట్టు కేతిక వేసిన బోల్డ్ స్టెప్స్ ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. సాంగ్ లో భాగంగా తాను వేసుకున్న స్కర్ట్ పైకి లాగడాన్ని విమర్శిస్తున్నారు. ఈ వింత చర్యలపై సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మన సంస్కృతి ఎక్కడికి పోయింది? ఆ స్కర్టును అలా లాగడంలో అర్ధం ఏమిటి అంటూ కొందరు ప్రశ్నించారు.