ఒకప్పుడు సౌత్ లో టాప్ హీరోయిన్ గా చలామణి అయిన ఖుష్బూ.. చిరంజీవి, వెంకటేష్ లాంటి అగ్ర హీరోలతో నటించింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఖుష్బూ పెళ్లి చేసుకున్న తర్వాత చాలా కాలం పాటూ సినీ ఇండస్ట్రీకి దూరంగానే ఉంది. మళ్లీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టి తనదైన శైలిలో సత్తా చాటుతోంది ఖుష్బూ.సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఖుష్బూ ఓ వైపు నటిగా ఉంటూనే మరోవైపు తన భర్త దర్శకత్వం వహించే సినిమాలకు నిర్మాతగా, రాజకీయ నాయకురాలిగా కూడా బాధ్యతల్ని తన సత్తా చాటుతోంది. అయితే ఒకప్పుడు బాగా బొద్దుగా ఉండే ఖుష్బూ ఇప్పుడు బరువు బాగా తగ్గి సన్నగా అయిన సంగతి తెలిసిందే. 54 ఏళ్ల వయసులో ఖుష్బూ ఇంత భారీగా బరువు తగ్గడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
రీసెంట్ గా ఖుష్బూ బరువు తగ్గాక కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బ్యాక్ టూ ఫ్యూచర్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఆ ఫోటోల్లో ఖుష్బూ గ్రీన్ కలర్ మోడ్రన్ డ్రెస్ లో ఎవరూ ఊహించనంత సన్నగా కనిపిస్తోంది. బాగా తీక్షణంగా చూస్తే కానీ ఆమె ఖుష్బూ అని గుర్తుపట్టలేనంతగా తన లుక్ మారిపోయింది. ఖుష్బూ లుక్ ని చూసి కొందరు పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంటే మరికొందరు మాత్రం ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఈ వయసులో కూడా ఎంతో కష్టపడి బరువు తగ్గినందుకు ఖుష్బూని కొందరు మెచ్చుకుంటుంటే మరికొందరు మాత్రం ఖుష్బూ కష్టపడి బరువు తగ్గలేదని, సన్నగా అవడానికి ఇంజెక్షన్స్ చేయించుకుందని, వాటి వల్లే బరువు తగ్గిందని, ఆ ఇంజెక్షన్స్ మ్యాజిక్ ను కూడా ఫాలోవర్లకు చెప్పమని ఓ నెటిజన్ కామెంట్ చేయగా దానికి ఖుష్బూ రెస్పాండ్ అయింది.అసలు మీరెలాంటి మనుషులు? మీ ముఖాలను మీరెప్పుడూ చూపించరు. ఎందుకంటే మీరంత అసహ్యంగా ఉంటారు కాబట్టి. మీ తల్లిదండ్రులను చూస్తుంటే చాలా జాలేస్తుంది అంటూ ఖుష్బూ రిప్లై ఇచ్చింది. ఖుష్బూ షేర్ చేసిన ఫోటోలతో పాటూ ఆమె నెటిజన్ కు కౌంటర్ ఇస్తూ చేసిన ట్వీట్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.