వైసీపీ ముఖ్య నేత కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. వైసీపీ హయాంలో మంత్రిగా పని చేసిన కొడాలి నాని కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో ఓటమి తరువాత రాజకీయంగానూ కొంత దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తున్నారు. కొడాలి నాని పైన కొన్ని కేసులు నమోదయ్యాయి. వాటి పైన కోర్టులో పోరాటం చేస్తున్నారు. కాగా, ఒక్క సారిగా కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
వైసీపీ ముఖ్య నేత కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. వైసీపీ హయాంలో మంత్రిగా పని చేసిన కొడాలి నాని.. రెండేళ్ల క్రితం అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ లో చికిత్స తీసుకున్నారు. ఆ తరువాత కోలుకున్నారు. ఎన్నికల్లో ఓటమి తరువాత రాజకీయంగా అంత యాక్టివ్ గా లేరు. జగన్ వద్ద సమావేశాలకు మాత్రం హాజరవుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొడాలి నాని తన వ్యాఖ్యలతో వివాదాస్పదంగా మారారు. టీడీపీ, చంద్రబాబు పైన అనుచిత వ్యాఖ్యలతో ఆయన తీరు వివాదాస్పదంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొడాలి నాని పైన కేసుల్లో విచారణకు సిద్దమయ్యారు. కాగా, కొడాలి నాని కోర్టులను ఆశ్రయించారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొడాలి నాని పైన చర్యలు తీసుకోవాలని టీడీపీ మద్దతు దారులు డిమాండ్ చేసారు. కొడాలి నాని అనుచరుల పైన కేసులు నమోదయ్యాయి. వల్లభనేని వంశీ ఇప్పటికే జైలులో ఉన్నారు. రాజకీయంగా వరుస పరిణామాలు చోటు చేసుకుంటున్న ఈ క్రమంలో కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఛాతీ నొప్పి రావటంతో ప్రస్తుతం ఆయన్ను హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స కోసం తరలించారు. గ్యాస్ సంబంధిత సమస్యలని చెబుతున్నా.. పూర్తి పరీక్షల తరువాత నిర్దారిస్తామని చెబుతున్న వైద్యులు.. పరిస్థితి నిలకడగానే ఉందని చెబుతున్నారు.