దళిత యువకుడు సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ కావడం తెలిసిందే. ఈ అంశంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. వంశీని అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ ఇవాళ వైసీపీ అధినేత జగన్ ధ్వజమెత్తారు.
ఈ క్రమంలో, సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన హైదరాబాద్ తీసుకెళ్లిన దృశ్యాల సీసీటీవీ ఫుటేజిని మంత్రి కొల్లు రవీంద్ర విడుదల చేశారు. ఈ నెల 11న హైదరాదులోనిమైహోమ్భుజా అపార్ట్ మెంట్ లో నమోదైన సీసీ కెమెరా దృశ్యాలను ఆయన విడుదల చేశారు. వల్లభనేని వంశీ నివసిస్తున్నది మై హోమ్ భుజా అపార్ట్ మెంట్ లోనే కావడం గమనార్హం.
ఫుటేజి విడుదల చేసిన సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. పులివెందుల ఫ్యాక్షనిజంను రాష్ట్రమంతా చేస్తామంటే ఊరుకునేది లేదని… ప్రశాంతమైన కృష్ణా జిల్లాలో అల్లర్లకు ప్రయత్నిస్తే సహించేది లేదని హెచ్చరించారు. సత్యవర్ధన్ ను ఎలా అపహరించారో సీసీ కెమెరా దృశ్యాలే సాక్ష్యమని అన్నారు.
https://twitter.com/JaiTDP/status/1891813213982851434